సునయన పెళ్లి అతనితోనేనా?

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:26 AM

‘కుమారి వర్సెస్‌ కుమారి’ చిత్రంతో వెండితెర ప్రవేశం చేశారు సునయన. ‘రాజరాజచోర’ చిత్రంతో హిట్‌ అందుకుని ఆ తర్వాత కొన్ని సినిమాలు, ‘మీట్‌ క్యూట్‌’, ‘ఇన్స్‌పెక్టర్‌ రిషి’ వెబ్‌ సిరీస్‌లో నటించారు...

సునయన పెళ్లి అతనితోనేనా?

‘కుమారి వర్సెస్‌ కుమారి’ చిత్రంతో వెండితెర ప్రవేశం చేశారు సునయన. ‘రాజరాజచోర’ చిత్రంతో హిట్‌ అందుకుని ఆ తర్వాత కొన్ని సినిమాలు, ‘మీట్‌ క్యూట్‌’, ‘ఇన్స్‌పెక్టర్‌ రిషి’ వెబ్‌ సిరీస్‌లో నటించారు. కొన్ని రోజుల క్రితం తనకు నిశ్చితార్థం అయ్యిందని సోషల్‌ మీడియాలో ప్రకటించి.. తన కాబోయే భర్త వేలు పట్టుకున్న ఫొటోను షేర్‌ చేశారు. కానీ తను పెళ్లాడబోయే వ్యక్తి పేరు మాత్రం చెప్పకుండా అందరినీ సస్పెన్స్‌లో పెట్టారు. తాజాగా, ఆమె పెళ్లి చేసుకోబోయేది దుబాయ్‌కు చెందిన ఖలీద్‌ అల్‌ అమేరి అనే యూట్యూబర్‌ను అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం జూన్‌ 26న ఖలీద్‌ అల్‌ అమేరి తన ఇన్‌స్టా ఖాతాలో ఓ అమ్మాయితో ఉంగరాలు మార్చుకున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. దీంతో సునయన నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకోబేయేది ఖలీల్‌నే అని అందరూ అనుకుంటున్నారు.


కాగా, ఖలీల్‌కు ఇప్పటికే సలామా మొహమ్మద్‌తో పెళ్లయిందని, ఫిబ్రవరి 14న వారిద్దరూ విడాకులకు అప్లై చేయగా వెంటనే విడాకులు మంజూరు అయ్యాయట. ఈ విషయాన్ని స్వయంగా ఖలీల్‌ భార్య సలామానే చెప్పారు.

Updated Date - Jul 02 , 2024 | 01:22 AM