అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు రాజమౌళి
ABN , Publish Date - Nov 23 , 2024 | 08:54 PM
అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు రాజమౌళి అనగానే ఏదేదో ఊహించేసుకుంటున్నారు కదా. అవును నిజమే అప్పట్లో చిరంజీవి ఇచ్చిన సపోర్ట్‌ను అదే సంస్థకు ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి ఇచ్చారు. ఇంతకీ ఆ సంస్థ ఏంటి? విషయం ఏమిటని అనుకుంటున్నారా? మరి ఆలస్యమెందుకు తెలుసుకోండి..
మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య స్టార్ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్‌కు హాజరై.. కొన్ని సంచలన విషయాలను రివీల్ చేసిన విషయం తెలిసిందే. క్యాన్సర్ నిమిత్తం ముందస్తు చికిత్స చేయించుకోవడం ద్వారా ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోగలమని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి, స్టార్ క్యాన్సర్ సెంటర్ ద్వారా సినీ ఇండస్ట్రీలోని కార్మికులకు, సినీ జర్నలిస్ట్‌లకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందించి.. మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వంతు వచ్చింది. ఇంతకీ రాజమౌళి ఏం చేశారని అనుకుంటున్నారా..
Also Read- Sreeleela: ‘పుష్ప2’ కిస్సిక్ సాంగ్ ప్రోమో విడుదల వేళ శ్రీలీల ఏం చేస్తుందో చూశారా..
స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక లివర్ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడాలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి.. స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రపంచ స్థాయి సదుపాయాలతో సిద్ధం చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థ మన హైదరాబాద్‌లో ప్రారంభం కావడం ఎంతో గర్వకారణం. మన శరీరానికి లివర్ అనేది చాలా ముఖ్యమైన భాగం. ఇలాంటి విభాగానికి ప్రత్యేకమైన సంరక్షణ అందించేందుకు ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపొందించిన ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం. డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడి బృందం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఇన్‌స్టిట్యూట్ కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, దేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదగాలని, ఎదుగుతుందని నమ్ముతున్నట్లుగా రాజమౌళి చెప్పుకొచ్చారు.
స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రజలకు ప్రపంచ స్థాయి లివర్ కేర్ అందించడంతో పాటు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు తెలిపారు. స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం, స్టార్ హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గూడపాటి, స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ మెంటార్ డాక్టర్ కే రవీంద్రనాథ్, డాక్టర్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి , రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్, డాక్టర్ రమేష్ కంచర్ల పాల్గొని, ఈ గొప్ప కార్యాన్ని ప్రారంభించడానికి వచ్చిన రాజమౌళికి థ్యాంక్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు, వైద్యనిపుణులు ఆసుపత్రి సౌకర్యాలు, సేవలను కొనియాడారు.