మోదీ నమాజు టోపీ ధరిస్తే చూడాలనుంది

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:42 AM

‘‘మోదీ వివిధ రకాల టోపీలు, తలపాగాలు ధరించడం చూశాం. ఆయన ముస్లింలు నమాజుకు వాడే టోపీని ధరిస్తే చూడాలని ఉంది. దానివల్ల మోదీకి ముస్లింల పట్ల ఎటువంటి వ్యతిరేకత లేదని...

మోదీ నమాజు టోపీ ధరిస్తే చూడాలనుంది

‘‘మోదీ వివిధ రకాల టోపీలు, తలపాగాలు ధరించడం చూశాం. ఆయన ముస్లింలు నమాజుకు వాడే టోపీని ధరిస్తే చూడాలని ఉంది. దానివల్ల మోదీకి ముస్లింల పట్ల ఎటువంటి వ్యతిరేకత లేదని తెలుస్తుంది’’ అని బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నసీరుద్ధీన్‌ షా అన్నారు. ఆయన బుధవారం ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో దేశానికి మూడో సారి నరేంద్ర మోదీ ప్రధానిగా ఎంపికవ్వడంపై స్పందిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ క్యాబినెట్‌లో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం బాధాకరమే అయినా పెద్దగా ఆశ్చర్యపరిచే విషయం కాదు’’ అని మాజీ రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ మాటలను గుర్తుచేసుకున్నారు.


విద్య, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

‘‘ప్రధానిగా మోదీ పాలన రాక ముందు కూడా దేశంలోని సమస్యలూ అలానే ఉన్నాయి. దేశంలోని సమస్యలన్నింటికీ మోదీనే కారణమనే ధోరణి సరికాదు. హిజాబ్‌, సానియా కురచ దుస్తులు లాంటి అంశాల గురించి ఆందోళన చెందడం తగ్గించి.. ముస్లింలు తమ విద్య, అభివృద్ధి, సమకాలీన ఆలోచనలపై దృష్టి పెట్టాలి’’ అని చెప్పారు.

Updated Date - Jun 13 , 2024 | 07:21 AM