పద్దెనిమిదేళ్లు ఎలా గడిచాయో!

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:38 AM

నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ పుట్టినరోజు వేడుకని ‘రోటీ కపడా రొమాన్స్‌’ యూనిట్‌ శనివారం నిర్వహించింది. ఆయన ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ 18 ఏళ్లు పూర్తి చేసుకోవడం...

పద్దెనిమిదేళ్లు ఎలా గడిచాయో!

నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ పుట్టినరోజు వేడుకని ‘రోటీ కపడా రొమాన్స్‌’ యూనిట్‌ శనివారం నిర్వహించింది. ఆయన ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ 18 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘ఒక్కో సినిమా తీసుకుంటూ ముందుకు నడుస్తుంటే పద్దెనిమిదేళ్లు ఎలా గడిచాయో తెలియలేదు. నేను తీసిన ప్రతి సినిమానీ నా స్నేహితులే కొన్నారు. ఇప్పుడు వస్తున్న ‘రోటీ కపడా రొమాన్స్‌’ చిత్రం కూడా మంచి హిట్‌ అవుతుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను కొనుక్కుంది. వాళ్లే త్వరలో అనౌన్స్‌ చేస్తారు. చాలా మంచి సినిమా తీశామనే తృప్తి ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:32 PM