C 202: షూటింగ్ మొత్తం.. రాత్రి పూటనే చేశాం

ABN , Publish Date - Jan 26 , 2024 | 09:30 PM

తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై. విజయ ప్రధాన పాత్రలో గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా, మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C 202). ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

C 202: షూటింగ్ మొత్తం.. రాత్రి పూటనే చేశాం
202

మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) పతాకంపై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై. విజయ ప్రధాన పాత్రలో గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ ( Sharon Riya Fernandez) హీరోయిన్‌గా, మనోహరి కె ఎ నిర్మాతగా, మున్నా కాశి (Munna Kasi) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C 202). ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది.అయితే జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి (Munna Kasi) మాట్లాడుతూ "మా 'సి 202' (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే చాలా ఆస‌క్తిక‌రంగా, అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమాని చిత్రకరించామ‌న్నారు. షూటింగ్ అంత పూర్తి అయిందని, ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా హై-ఎండ్ కెమెరాలను, మంచి లైటింగ్ పరికరాలు ఉపయోగించామన్నారు.

Updated Date - Jan 26 , 2024 | 09:30 PM