పొలిటిక‌ల్ ప్ర‌చారంలో హీరో వెంక‌టేశ్ కుమార్తె.. వీడియో వైర‌ల్

ABN , Publish Date - May 01 , 2024 | 03:44 PM

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల హంగామా భానుడి భ‌గ‌భ‌గ‌ల క‌న్నా వేడిగా న‌డుస్తోండ‌గా అయా పార్టీల అభ్య‌ర్థులు ప్ర‌చారాల్లో మునిగిపోయారు. తాజాగా వెంక‌టేశ్ కుమార్తె అశ్రిత రాజ‌కీయ రంగంలోకి దిగింది

పొలిటిక‌ల్ ప్ర‌చారంలో హీరో వెంక‌టేశ్ కుమార్తె.. వీడియో వైర‌ల్
asritha

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల హంగామా భానుడి భ‌గ‌భ‌గ‌ల క‌న్నా వేడిగా న‌డుస్తోండ‌గా అయా పార్టీల అభ్య‌ర్థులు ప్ర‌చారాల్లో మునిగిపోయారు. నిత్యం రోడ్ షోల‌తో, భారీ బ‌హిరంగ స‌భ‌ల‌తో జ‌నంలోకి చొచ్చుకెళ్లేందుకు, ఓట్లు రాబ‌ట్టుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ సారి సినిమా రంగం నుంచి ఈ పార్టీ ప్ర‌చారాల్లో పాల్గొనే వారు అంత‌గా క‌నిపించ‌డం లేదు. తెలంగాణ‌లో అస‌లు సినిమా వాళ్ల ఊసూ క‌నిపించ‌క‌పోగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ (PAWAN KALYAN) పోటీ చేస్తున్న పిఠాపురంలో నాగ‌బాబు, హైప‌ర్ ఆది వంటి వారు యాక్టివ్‌గా ప్ర‌చారంలో పాలు పంచుకుంటున్నారు.

ashritha.jpg

అయితే ప్ర‌స్తుత‌ ఎన్నిక‌ల హ‌డావుడిలో.. ఇప్పుడు అంద‌రి దృష్టి తెలంగాణ‌లోని ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానంపై ప‌డింది. ఇక్క‌డ బీఆరెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వ‌ర రావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్‌రావులు పోటీ చేస్తుండ‌గా.. ప్ర‌స్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ (Hero Venkatesh)ల వియ్యంకుడు రామ‌స‌హాయం రఘురామ్ రెడ్డి కాంగ్రెస్ (Congress) నుంచి బ‌రిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రఘురామ్ రెడ్డి కోసం హీరో వెంక‌టేశ్ (Hero Venkatesh) ప్ర‌చారం చేస్తారా లేదా అనేది నాలుగైదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.


ఇప్పుడు ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ వెంక‌టేశ్(Hero Venkatesh) కు బ‌దులుగా ఆయ‌న కుమార్తె అశ్రిత (Ashrita) రంగంలోకి దిగింది. త‌న మామ‌య్య రఘురామ్ రెడ్డి విజ‌యం కోసం ఈ రోజు ఖ‌మ్మంలో నిర్వ‌హించిన మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ కండువా క‌ప్పుకుని స‌మావేశానికి హ‌జ‌రైన అశ్రిత (Ashrita) ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ అంద‌రూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రఘురామ్ రెడ్డిని గెలిపించాల‌ని కోరారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్‌గా మారింది. మీరూ వీక్షించండి.

Updated Date - May 03 , 2024 | 12:33 PM