Krishna Sai: పేద విద్యార్థినికి.. హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం

ABN , Publish Date - May 02 , 2024 | 05:07 PM

రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు సుందరాంగుడు మూవీ హీరో కృష్ణ సాయి. తాజాగా ఓ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మాన‌వ‌త్వం చాటుకున్నారు.

 Krishna Sai: పేద విద్యార్థినికి.. హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం
krishna sai

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అభాగ్యలకు అండగా ఉంటు రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు సుందరాంగుడు మూవీ హీరో కృష్ణ సాయి (Krishna Sai). తాజాగా ఓ నిరుపేద కుటుంబానికి చెందిన‌ డిగ్రీ విద్యార్థిని జి.లావ్యకు ఆర్థిక సాయం చేసి మాన‌వ‌త్వం చాటుకున్నారు. మే 1న‌ కృష్ణసాయి పుట్టినరోజు సందర్భంగా కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు చేతుల మీదుగా రూ. 15 వేలు చెక్కు అందించారు.

sai.jpeg


పేద‌రికంతో ఎవ‌రి చ‌దువులు ఆగిపోకూడ‌ద‌ని, మ‌ట్టిలో మాణిక్యాలకు చేయుత ఇవ్వ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌ని హీరో కృష్ణసాయి అన్నారు. చ‌దువుల త‌ల్లి లావ్యకు త‌న స‌పోర్టు ఉంటుంద‌ని తెలిపారు. త‌న సేవ‌లు నిరంత‌రం కొన‌సాగుతాయ‌ని త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా కృష్ణసాయి అన్నారు. ఆప‌త్కాలంలో త‌మ‌కు ఆర్థిక సాయం చేసిన కృష్ణసాయికి విద్యార్థిని జి.లావ్య కుటుంబం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఇదిలాఉండ‌గా ‘సుందరాంగుడు’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన కృష్ణ సాయి.. ప్రస్తుతం ‘జ్యువెల్‌ థీఫ్‌'(నగల దొంగ)లో నటిస్తున్నారు.

Updated Date - May 03 , 2024 | 12:30 PM