నేను-కీర్తన.. మంచి బ్లాక్ బస్టర్ కావాలి: సాయి రాజేష్

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:37 PM

రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన నేను కీర్తన ఘన విజయం సాధించాలని దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలోని "సీతాకోకై ఎగిరింది మనసే" గీతం లిరికల్ వీడియోను ఆయ‌న విడుదల చేశారు.

నేను-కీర్తన.. మంచి బ్లాక్ బస్టర్ కావాలి: సాయి రాజేష్
nenu keerthana

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన నేను కీర్తన‌ (Nenu Keerthana)ఘన విజయం సాధించాలని దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలోని "సీతాకోకై ఎగిరింది మనసే" గీతం లిరికల్ వీడియోను ఆయ‌న విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "నేను - కీర్తన"లో సక్సెస్ కళ కనబడుతోంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాట చాలా బాగుంది. చిమటా రమేష్ బాబుకి దర్శకుడిగా, హీరోగా ఉజ్వల భవిష్యత్ ఉందనిపిస్తోంది" అన్నారు.

WhatsApp Image 2024-06-10 at 3.31.55 PM.jpeg

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా.. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం నేను-కీర్తన."ఎంతో బిజీ షెడ్యూల్ లో సైతం తమ కోసం సమయాన్ని కేటాయించిన సాయి రాజేష్ కు హీరో కమ్ డైరెక్టర్ చిమటా రమేష్ బాబు ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.


WhatsApp Image 2024-06-10 at 3.31.54 PM.jpeg

సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.).

Updated Date - Jun 10 , 2024 | 09:58 PM