Record Break: పాన్ ఇండియా చిత్రంగా.. 8 భాష‌ల్లో ‘రికార్డ్ బ్రేక్’

ABN , Publish Date - Feb 18 , 2024 | 07:33 PM

చాలా కాలం త‌ర్వాత బిచ్చ‌గాడు వంటి సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందంచిన‌ చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో వస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్.

Record Break: పాన్ ఇండియా చిత్రంగా.. 8 భాష‌ల్లో ‘రికార్డ్ బ్రేక్’
rcord break

చాలా కాలం త‌ర్వాత బిచ్చ‌గాడు వంటి సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందంచిన‌ చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivasa Rao) దర్శకత్వంలో శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్ (Record Break). ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాతృదేవోభవ దర్శకుడు అజయ్ కుమార్ గ్లింప్స్ ని, నిర్మాత రామ సత్యనారాయణ టీజర్‌ని, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈవెంట్లో తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ, ఆర్టిస్ట్ నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది చదలవాడ శ్రీనివాసరావు గారని,. ఆయన చేస్తున్న ఈ సినిమా అన్ని జోనర్స్ కి భిన్నంగా ఉండ‌బోతున్న‌ద‌న్నారు. ఇద్దరు అనాథ‌లు దేశానికి గర్వకారణంగా ఎలా మారారనే కథతో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయ‌ని ఒక కొత్త పాయింట్‌ని ఈ సినిమాలో చూపివ‌చ‌బోతున్నార‌న్నారు. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆ కొత్త పాయింట్ గురించి కచ్చితంగా మాట్లాడుకునే అంత మంచి సినిమా అవుతుందన్నారు.

WhatsApp Image 2024-02-18 at 7.26.32 PM.jpeg

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ.. చదలవాడ గారు గతంలో జీవిత ఖైదీ, మనిషా కొయిరాలతో హిందీలో మాతృదేవోభవ, నారాయణ మూర్తితో ఏ ధర్తీ హమారీ అనే హిందీ సినిమా చేశార‌న్నారు. సినిమా మీద వచ్చే డబ్బును చూసుకోకుండా బిజినెస్ మీద వచ్చే డబ్బును కూడా సినిమా పైన పెట్టే అంతటి సినిమా ప్రేమికుడు చదలవాడ శ్రీనివాసరావు గార‌న్నారు. పెద్ద హీరోలు కూడా చేయలేని పబ్లిసిటీతో ప్రొడ్యూసర్ గా త‌న‌ సినిమాల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తి అన్నారు. ఇప్పుడు ఆయ‌న‌ ఈ రికార్డ్ బ్రేక్ సినిమాతో ఎంతోమందిని ఇండస్ట్రీస్ పరిచయం చేస్తున్నార‌న్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్‌ను రెండు భాషల్లో చూశాన‌ని చాలా బాగా అనిపించిందన్నారు. ఈ సినిమా సెట్, గ్రాఫిక్స్ చూస్తే బాహుబలిని మించిపోయే సినిమా అవుతుందన్నారు. శ్రీనివాసరావు గారు. ఈ సినిమాని ఎనిమిది భాషల్లో అతి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో 8 భాషలలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్ పూరి, బెంగాలీ మరియు ఒడియాల‌లో రిలీజ్ చేస్తున్నార‌ని, ఈ సినిమా టీమ్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.


దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వర్గీయ చలపతిరావు గారు మొదటి రోజు నుంచి సినిమా కోసం నాతో పాటు నిలబడ్డారు. ఆయన డబ్బింగ్ చివరలో చెప్పారని, డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూసి బయటకు వస్తూ ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోలేనన్నారు. ఈ సినిమా ఇంత చక్కగా రావడానికి నాలో సగ భాగం అయిన నా దర్శకుడు అజయ్ కే దక్కుతుందన్నారు. ఈ సినిమా ఎంత చక్కగా రావడానికి ఈవెంట్ ఇంత బాగా జరగడానికి నాకు కొండంతండగా ఉంన్న‌ది నా ప్రసన్నకుమార్ అన్నారు. ఈ సినిమాకి మెయిన్ హీరోలు ఆర్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అని సాబు వర్గీస్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడన్నారు. నాకున్న అనుభవంతో సొసైటీకి ఉపయోగపడే కథ‌తో ఈ సినిమా మొదలు పెట్టాన‌న్నారు. నాతోటి దర్శకులు కొంతమంది ఈ సినిమా చూసిన రికార్డ్ బ్రేక్ కరెక్ట్ టైటిల్ అని చెప్పారన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లోనూ వండర్స్ క్రియేట్ చేస్తుందని, లాస్ట్ 45 నిమిషాలు ఈ సినిమా మంచి ఎమోషనల్ గా ఉంటుందన్నారు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుందని, ఈ సినిమాని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరూ ఈ సినిమాను చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

Updated Date - Feb 18 , 2024 | 07:33 PM