దర్శకుడు సుకుమార్‌ కుమార్తెకు ఉత్తమ బాల నటి పురస్కారం

ABN , Publish Date - May 02 , 2024 | 04:27 AM

డైరెక్టర్‌ సుకుమార్‌ కుమార్తె సుకృతి బండ్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తొలి చిత్రంతోనే ఉత్తమ బాల నటి పురస్కారం ఆమెను వరించింది...

దర్శకుడు సుకుమార్‌  కుమార్తెకు ఉత్తమ బాల నటి పురస్కారం

డైరెక్టర్‌ సుకుమార్‌ కుమార్తె సుకృతి బండ్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తొలి చిత్రంతోనే ఉత్తమ బాల నటి పురస్కారం ఆమెను వరించింది. ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో ఆమె నటనకు మెచ్చి మంగళవారం ఢిల్లీలో ఈ అవార్డును అందజేశారు. ఈ చిత్రానికి ఇప్పటికే సుకృతి పలు అవార్డులను అందుకోవడం విశేషం. అలాగే, పర్యావరణ పరిరక్షణ కోసం సందేశాత్మంగా తెరకెక్కిన ఈ చిత్రం పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డులను గెలుచుకుంది.

Updated Date - May 03 , 2024 | 12:32 PM