థియేటర్ల బంద్‌ నిజం కాదు

ABN , Publish Date - May 17 , 2024 | 02:37 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లను మూసివే స్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్‌ బాడీలు...

థియేటర్ల బంద్‌ నిజం కాదు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లను మూసివే స్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్‌ బాడీలు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ గురువారం స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆ సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. థియేటర్లను మూసి వేస్తున్నట్లు ఒక సంఘం నిర్ణయం తీసుకుందంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థలు ఖండించాయి. ‘ఇప్పటివరకూ థియేటర్ల యజమానులు కానీ, వారికి సంబంధించిన సంఘాలు గానీ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇదంతా అబద్దపు ప్రచారం మాత్రమే’ అని స్పష్టం చేశాయి. ‘కొన్నాళ్లుగా వసూళ్లు తక్కువ రావడం వల్ల కొంతమంది థియేటర్ల యజమానులు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని ఉండవచ్చు, అపెక్స్‌ బాడీలకు దీంతో సంబంధం లేదు’ అని పేర్కొన్నాయి. సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లను మూసివెయ్యాలనే నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్లు తమను సంప్రదించలేదని ఫిల్మ్‌ ఛాంబర్‌ తెలిపింది.

Updated Date - May 17 , 2024 | 03:44 PM