Mantrapetika: అశ్వనీదత్ భార్య భక్తి సమ్మోహనమే పురాణపండ ‘మంత్రపేటిక’లోని దైవీయ చైతన్యం

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:53 PM

నిర్మాత చలసాని అశ్వనీదత్ తన సతీమణి చలసాని వినయకుమారి కోరిక మేరకు పురాణపండ శ్రీనివాస్ ‘మంత్రపేటిక’ దివ్య గ్రంధాన్ని దగ్గరుండి దేవాలయాలకు, ధార్మిక మండళ్లకు ఎంతో శ్రద్ధతో పంచిపెట్టించారని వైజయంతి కార్యాలయ సిబ్బంది బాహాటంగా చెబుతున్నారు. అశ్వనీదత్ భార్య భక్తి సమ్మోహనమే పురాణపండ ‘మంత్రపేటిక’లోని దైవీయ చైతన్యం అని అంతా ముక్తకంఠంతో చెబుతుండటం విశేషం.

Mantrapetika: అశ్వనీదత్ భార్య భక్తి సమ్మోహనమే పురాణపండ ‘మంత్రపేటిక’లోని దైవీయ చైతన్యం
Puranapanda Srinivas, Ashwini Dutt and Vinaya Kumari

వేద స్వర సమ్మోహనంలోంచి వర్షించే అనుభూతులకు కైమోడ్పు ఘటిస్తూ... దేవాలయ గోపురం మీంచి ప్రొద్దుటి పూట వచ్చే మంగళమయ నాదం లాంటి ఒక అద్భుతమైన పుస్తకాన్ని అశ్వనీదత్ మాకు పంపించారని విజయవాడ ఇంద్రకీలాద్రి పైనున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానముల అర్చక వేదపండిత బృందం అంటుంటే... కాణిపాకం దేవస్థానానికి చాలామంది బుక్స్ పంపిస్తుంటారు కానీ ప్రాచీన సంప్రదాయాలమధ్య పారిజాత పరిమళంలాంటి ఈ ఎంచక్కని గ్రంథాల్ని మా అందరికీ అందించిన అశ్వనీదత్‌ (Ashwini Dutt)కి కృతజ్ఞతలంటున్నారు శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం అధికార అర్చక గణాలు. మా ఉన్నతాధికారి శ్రీనివాసరాజు ద్వారా మాకు అశ్వనీదత్ అందజేసిన పవిత్రమైన గ్రంధమాలికలు వేదప్రామాణ్యంతో, శృతి గౌరవంతో ఉన్నాయన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన వేదపండిత సమూహాలు. అంతేకాదు దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా ధర్మప్రచారపరిషత్ నిర్వహించే కార్యక్రమాల్లో అశ్వనీదత్ ఇటువంటి పరమపుణ్యాల గ్రంధాలు బహూకరిస్తే ఆ పుణ్యం తిరుమల శ్రీవారికి చేరుతుందన్నారు మొన్న మొన్నటి వరకూ ఈ శాఖను పర్యవేక్షించిన ధర్మప్రచార పరిషత్ పర్యవేక్షణాధికారులు.

Mantrapetika.jpg

ఎన్నెన్నో ప్రశంసల్ని అశ్వనీదత్‌పై వర్షించడానికి కారణం పరిశీలిస్తే...

ఒక ఆహ్లాదానుభూతిని పవిత్రంగా కలిగించే గాఢ భక్తికి కేంద్రంగా ఒకానొక స్పష్టమైన జ్ఞానవిజ్ఞాన కాంతుల మహాగ్రంధం దర్శనమిస్తుంది. సుమారు ఆరువందల పేజీలతో... చూడగానే మనస్సులో సౌందర్యంతో ప్రతిష్ఠితమయ్యే ఈ అక్షర వేదిక పేరు.. ‘మంత్ర పేటిక’. అనేక దేవాలయాల్లో అశ్వనీదత్‌కి ఎంతో గౌరవాన్ని పెంచిన ఈ మంత్రపేటిక వెనుక ఋషిలాంటి తేజస్సు నిస్సందేహంగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌ (Puranapanda Srinivas)దే.

తెలుగునాట వేల వేల హృదయాల్ని ఉప్పొంగించేలా గ్రంథ సంపదనందించిన నిస్వార్ధపు ఘనత పురాణపండ శ్రీనివాస్‌ది కాబట్టే... భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా (Amit Shah) సైతం పురాణపండ అద్భుత రచనా సంకలమైన ఐదువందల ఆంజనేయ అపురూపపు కళాఖండాల వేవేల మన్త్రశక్తుల ‘నన్నేలు నా స్వామి’ అఖండ మహా గ్రంధాన్ని ఆవిష్కరించి ‘మనః స్థితిని ప్రశాంత స్థితిగా ఉంచే పుస్తకాలు పురాణపండ శ్రీనివాస్ బుక్స్’ అన్నారంటే పురాణపండ బుక్స్‌లోని సమ్మోహన శక్తికి ఎంతటి దైవబలం ఉందోనని నాడు విజ్ఞులు చర్చించుకున్నారు కూడా.


భారతదేశపు తెలుగు అగ్రశ్రేణి నిర్మాతగా, వైజయంతీ మూవీస్ అధినేతగా, ఆడంబరాలకు, ఆర్భాటాలకు దూరంగా మూడు తరాల కథానాయకుల, నాయికలతో ఈ నాటికీ అప్రతిహతంగా దూసుకుపోతున్నప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ తన భార్య శ్రీమతి చలసాని వినయకుమారి (Chalasani Vinayakumari) కోరిక మేరకు ఈ దివ్య గ్రంథాల్ని దగ్గరుండి దేవాలయాలకు, ధార్మిక మండళ్లకు ఎంతో శ్రద్ధతో పంచిపెట్టించారని వైజయంతి కార్యాలయ సిబ్బంది బాహాటంగా చెబుతున్నారు.

Ashwini.jpg

ఇకపోతే మానవ జీవనంలో భక్తియుత సౌందర్య దృక్పథాల్ని ఏర్పరచుకోవడానికి పురాణపండ శ్రీనివాస్ బుక్స్ గొప్ప సాధనాలంటారు భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. తొలి యవ్వనకాలంలోని ఈనాటి తెలుగు యువతీ యువకులు సైతం పురాణపండ శ్రీనివాస్ గ్రంధరాశిని ఎంతో ప్రేమిస్తారు.. పారాయణం చేస్తారు. గాఢ రసభక్తితో పురాణపండ పుస్తకాల్ని చేతపట్టుకుని తాదాత్య్మ చెందుతారు. అశ్వనీదత్ పురాణపండ శ్రీనివాస్‌తో అందించిన ఈ ‘మంత్రపేటిక’ మహా గ్రంధంలో ఎంతో ఆకట్టుకునే స్వర్ణమయ వర్ణ చిత్రాలు, కఠిన సంక్షోభాల్ని విసిరికొట్టే మంత్రశక్తులు ఎన్నో ఉన్నాయి. చాలామందిలో ఉండే సహజ వక్రతల్ని మట్టుబెట్టే వేద మంత్రాల వ్యాఖ్యానాలు పురాణపండ శ్రీనివాస్ కలంలోంచి చాలా అద్భుతంగా జాలువారాయి. దైవం పట్ల ఎంతో మర్యాదా సూచకంగా పుస్తకాన్ని వెలువరించారు పురాణపండ శ్రీనివాస్. మంత్రపేటికలోకి మనం ప్రయాణించాక ఋషులతో మనం సంభాషిస్తాం. మనకి తెలీకుండా మనం ఆలయాల్లో ప్రదక్షిణం చేసే అనుభూతి చెందుతాం. అక్కడక్కడా నల్లమల అడవుల్లోని పర్వతాల మధ్య ఉన్న అహోబిల నారసింహుడు, తిరుమల శ్రీనివాసుడు, శ్రీశైల మల్లికార్జునులకు పురాణపండ శ్రీనివాస్ చేసే అందమైన పవిత్ర భాషాసంస్కార స్వరాల అభిషేకం భక్తపాఠకుని చేత ‘వాహ్’ అనిపిస్తుంది. ఇంతటి గొప్ప గ్రంధాన్ని సినీ పరిశ్రమ కేంద్రంగా జీవించే అశ్వనీదత్ భార్య శ్రీమతి వినయకుమారి సమర్పణలో ప్రచురించబడటం చాలా చాలా ఉదాత్తమైన అంశమే అయినా... కొన్ని ఆలయాలకు, కొందరు ఈ మంత్ర పారిజాతం అందలేదని...

Puranapanda.jpg

సినీ రంగంలో కొందరు ప్రముఖులకు మాత్రమే ఈ మంత్రపేటిక అందిందని... సినీ పరిశ్రమలో చాలామందికి అందితే కొన్ని కాలాలపాటు అశ్వనీదత్ దంపతుల పేరు చెప్పుకుంటామని మా (MAA) కార్యవర్గ సభ్యుడొకరు బహిరంగంగానే విమర్శించారట. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి నిర్మాతల మండలివరకూ ఉన్న అన్ని విభాగాలకూ ఇంతటి మహా గ్రంధాన్నిఅశ్వనీదత్ ఇస్తే ఏదో దైవశక్తి మమ్మల్ని కాపాడుతుందని నమ్మకం మాక్కూడా వుంటుంది సార్’ అని వైజయంతి సంస్థ ఉద్యోగితో ఒక సహాయ నటి గతంలో చెప్పేసిందిట కూడా.

జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో చాలా ఆలయాలవారు ఇప్పటికే ఈ ‘మంత్రపేటిక’ గురించి వైజయంతి సంస్థ చుట్టూ ఎన్నో సార్లు ప్రదక్షిణ చేసినా సమయానికి అశ్వనీదత్ కార్యాలయంలో లేక, సిబ్బంది బుక్స్ అయిపోయాయని చెప్పడంతో నిరాశకు గురయ్యారని సమాచారం. సరే... ఏదేమైనా చలసాని అశ్వనీదత్ సతీమణి వినయకుమారి సమర్పించిన ఈ పురాణపండ పుస్తక తేజస్సు వైజయంతి సంస్థకు మరొక పవిత్ర వెలుగును సంతరించిపెట్టిందని నిస్సందేహంగా చెప్పాల్సిందే!

Updated Date - Apr 28 , 2024 | 04:00 PM