Arbaaz Khan: మ‌రో తెలుగు సినిమాలో.. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్

ABN , Publish Date - Jan 30 , 2024 | 07:09 PM

యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోకి తాజాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ అడుగు పెట్టారు.

Arbaaz Khan: మ‌రో తెలుగు సినిమాలో.. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్
arbaaz khan

యువ నటుడు అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ (Ganga Entertainments) ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ (Apsar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోకి తాజాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) అడుగు పెట్టారు. దిగంగనా సూర్యవంశీ (Digangana Suryavanshi) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'హైపర్' ఆది, తమిళ నటుడు సాయి ధీన ప్రధాన పాత్రలో నటించనున్నారు

మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవ' చిత్రం తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ 'బిగ్ బ్రదర్స‌,తెలుగులో కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి ఒక‌టి, రెండు తెలుగు చిత్రాల‌లోను నటించారు. మ‌ళ్లీ కొద్ది గ్యాప్‌ తరువాత ఒక డిఫరెంట్ కథతో తెర‌కెక్కుతున్న ఓ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి (Maheswara Reddy Mooli) మాట్లాడుతూ ''అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది.

కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 07:09 PM