Allu Arjun: అల్లు అర్జున్ ప్రెస్ మీట్.. సీఎం వ్యాఖ్యలకు కౌంటరిస్తారా?

ABN , Publish Date - Dec 21 , 2024 | 06:16 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన ఏం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మీడియా సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

CM Revanth Reddy and Allu Arjun

శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ వేదికగా సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ సీఎం మండిపడ్డారు. పోలీసులు చెప్పినా వినకుండా ర్యాలీ నిర్వహించి ఓ మహిళ ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడని, ఆమె కుమారుడు సైతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. అతన్ని అరెస్టు చేస్తే నానా హంగామా చేశారని మండిపడ్డారు.

అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత పెద్దఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించేందుకు వెళ్లారని ధ్వజమెత్తారు. కానీ బాధిత కుటుంబాన్ని మాత్రం ఏ ఒక్కరూ పరామర్శించలేదని ఆగ్రహించారు. అతన్ని అరెస్టు చేస్తే కొన్ని రాజకీయ పార్టీల నేతలు సైతం తనను విమర్శించారని సీఎం చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ఏమైనా దేవుడా? అతనికి ఏమైనా కాళ్లు, చేతులు విరిగాయా? జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రముఖులు పరామర్శిస్తూ ఎందుకంత హంగామా చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.


ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 7 గంటలకు అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహిస్తుండటంతో.. అసలు అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అల్లు అర్జున్ కౌంటర్ ఇస్తారా? మరేదైనా వివరణ ఇస్తారా? అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ సినీ, రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Also Read-అల్లు అర్జున్ కాలు విరిగిందా? చెయ్యి విరిగిందా?: సీఎం రేవంత్

Also Read-Sandhya Theatre Stampede: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read-UI Movie Review : ఉపేంద్ర నటించిన UI మూవీ ఎలా ఉందంటే..

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 21 , 2024 | 06:16 PM