మార్కెటింగ్ స్కామ్ నేపథ్యంలో.. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘గ్యాంగ్ స్టర్’

ABN , Publish Date - Jan 16 , 2024 | 05:03 PM

స్టోనెక్స్ బ్యానర్ పై పి బి వేలుమురుగన్ నిర్మాతగా, రామ్ ప్రభ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నిర్మిస్తున్న చిత్రం "గ్యాంగ్ స్టర్". మూడు భాషల్లో రూపుదిద్దుకుంటున్న "గ్యాంగ్ స్టర్" చిత్రం మార్చి నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

మార్కెటింగ్ స్కామ్ నేపథ్యంలో.. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్  ‘గ్యాంగ్ స్టర్’
gangster

స్టోనెక్స్ బ్యానర్ పై పి బి వేలుమురుగన్ నిర్మాతగా, రామ్ ప్రభ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నిర్మిస్తున్న చిత్రం "గ్యాంగ్ స్టర్". గ్రానైట్ స్లాబులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత వేలు మురుగన్. సినీ పరిశ్రమపై ఉన్న మక్కువతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మూడు భాషల్లో రూపుదిద్దుకుంటున్న "గ్యాంగ్ స్టర్" చిత్రం మార్చి నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

10e0d2a6-7724-436a-ab60-f87053ceffc6.jpeg

ఈ సందర్భంగా నిర్మాత వేలు మురుగన్ మాట్లాడుతూ మార్కెటింగ్ స్కామ్ అనే నూత‌న‌ పాయింట్ పై సినిమా అంతా న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి పాయింట్ పై సినిమా రాలేద‌ని చెప్పాలి. ఇందులో హీరోలు ఎవ‌రు? విల‌న్స్ ఎవ‌రు? అనేది క్లైమాక్స్ వ‌ర‌కు తెలియ‌దు. ప్ర‌తి పాత్ర ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా క్యూరియాసిటీ క‌లిగించే విధంగా ఉంటుంది. ద‌ర్శ‌కుడు రామ్ ప్రభ సినిమాను ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టించి ప్ర‌స్తుతం మంచి చిత్రాల్లో న‌టిస్తోన్న ప్ర‌జిన్ ప‌ద్మ‌నాభ‌న్ , జీవా మ‌రియు విజ‌య్ విశ్వ ముఖ్య పాత్ర‌లో న‌టించారు. అలాగే సాయిధ‌న్య, మోహ‌న సిద్ధి, షాలిని హీరోయిన్స్ గా ప‌రిచ‌యం చేస్తున్నాం. ముగ్గురు కూడా అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంటారు. ఆర్టిస్టులంద‌రూ త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా పోటీప‌డుతూ న‌టించార‌న్నారు.


842e87cc-90ac-4a3a-8538-67d52bfc81ca.jpeg

త‌మిళంలో ప‌లు హిట్ చిత్రాల‌కు ప‌ని చేసిన మ‌నోజ్ కుమార్ బాబు మా సినిమాకు ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చార‌ని, త‌న బీజీయ‌మ్ తో సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లారన్నారు. అలాగే ఎన్నో మంచి చిత్రాల‌కు ప‌ని చేసిన సురేష్ కుమార్ సుంద‌రం సినిమాటోగ్ర‌ఫీ, ర‌వీంద్ర‌న్ వేసిన ఎయిర్ పోర్ట్ సెట్ సినిమాకే హైలెట్ గా నిల‌వ‌నుందన్నారు. ప్ర‌తి టెక్నీషియ‌న్ ప్రాణం పెట్టి ప‌ని చేశారని, క్లైమాక్స్ లో వ‌చ్చే ట్విస్ట్ తో పాటు ఆరు అద్భ‌తుమైన ఫైట్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయన‌డంలో డౌటే లేదన్నారు. క‌థ‌, క‌థ‌నాలు చాలా కొత్త‌గా ఉంటాయన్నారు.

Updated Date - Jan 16 , 2024 | 05:03 PM