కేన్స్‌కు ఐశ్వర్య కళ

ABN , Publish Date - May 17 , 2024 | 02:30 AM

ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గురువారం ఆమె రెడ్‌కార్పెట్‌పై...

కేన్స్‌కు ఐశ్వర్య కళ

ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గురువారం ఆమె రెడ్‌కార్పెట్‌పై నడిచారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ వేడుకకు ప్రత్యేక కళ తెచ్చారు. ఫ్రాన్స్‌లో జరుగుతోన్న ఈ వేడుకల్లో ఐశ్వర్యతో పాటు కియారా అద్వాణీ, శోభితా ధూళిపాళ, అదితీరావ్‌ హైదరీ పాల్గొన్నారు.


చేతికి కట్టుతో...

ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ కేన్స్‌ చలనచిత్రోత్సవంలో మరోసారి మెరవబోతున్నారు. గురువారం కూతురు ఆరాధ్యతో కలసి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు బయల్దేరివెళ్లారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ గురువారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. చేతికి గాయం అయినప్పుడు ధరించే కట్టుతో ఐశ్వర్య కనిపించారు. దీంతో రెడ్‌కార్పెట్‌ పై ఆమె ప్రదర్శనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Updated Date - May 17 , 2024 | 03:43 PM