భార్య చెప్పులు మోసిన కొత్త పెళ్లికొడుకు

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:21 AM

సీనియర్‌ నటుడు శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి వివాహం ఆమె చిరకాల స్నేహితుడు జహీర్‌ ఇక్బాల్‌తో ఇటీవలే జరిగింది. భార్య సోనాక్షి అంటే ఇక్బాల్‌కు ఎంత ప్రేమ అంటే....

భార్య చెప్పులు మోసిన కొత్త పెళ్లికొడుకు

సీనియర్‌ నటుడు శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి వివాహం ఆమె చిరకాల స్నేహితుడు జహీర్‌ ఇక్బాల్‌తో ఇటీవలే జరిగింది. భార్య సోనాక్షి అంటే ఇక్బాల్‌కు ఎంత ప్రేమ అంటే.. ఆమె చెప్పుల్ని కూడా మోసేంతగా. అవునండీ. నిజం. ఈ మధ్య ఇక్బాల్‌, సోనాక్షి కలసి ఓ హోటల్‌కు వెళ్లారు. అప్పుడు సోనాక్షి వేసుకున్న చెప్పులతో ఇబ్బంది పడుతుంటే, ‘నువ్వు ఉండు’ అని ఆమె చెప్పులు పట్టుకుని ఇక్బాల్‌ నడుస్తుంటే వెనుక నడుస్తూ వీడియో తీశారు సోనాక్షి. ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘కరెక్ట్‌ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుంది’ అని రాసుకొచ్చారు సోనాక్షి.

Updated Date - Jul 02 , 2024 | 01:23 AM