ప్ర‌పంచంలో.. మ‌నిష‌న్న‌వాడు చూడ‌లేని అతి జుగుప్సాక‌ర‌ సినిమాలివే!

ABN , Publish Date - Mar 19 , 2024 | 06:43 PM

సాధార‌ణంగా మ‌నం ఇప్ప‌టివ‌ర‌కు చాలా సినిమాలు చూసి ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఇక్క‌డ ప్ర‌స్తావించ బోతున్న చిత్రాలు ఏ జాన‌ర్ కింద‌కు వ‌స్తాయో కూడా చెప్ప‌లేనంతగా అవి తెర‌కెక్కాయి.

ప్ర‌పంచంలో.. మ‌నిష‌న్న‌వాడు చూడ‌లేని అతి జుగుప్సాక‌ర‌ సినిమాలివే!
movies bareble

సాధార‌ణంగా మ‌నం ఇప్ప‌టివ‌ర‌కు చాలా సినిమాలు చూసి ఉంటాం, చూస్తూనే ఉంటాం. అందులోనూ కామెడీ, హ‌ర్ర‌ర్‌, రోమాన్స్ , వార్, పిరియాడిక్‌, డిజాస్ట‌ర్‌,సైన్స్ ఫిక్ష‌న్ అంటూ ఇలా ప‌లు ర‌కాల జాన‌ర్లలో వ‌చ్చిన సినిమాల‌ను మ‌న చిన్న‌ప్ప‌టినుంచి వీక్ష‌స్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇక్క‌డ ప్ర‌స్తావించ బోతున్న సినిమాల గురించి మీకు ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌క‌పోవ‌చ్చు, అఖ‌రుకు విని కూడా ఉండ‌క పోవ‌చ్చు. ఈ చిత్రాలు ఏ జాన‌ర్ కింద‌కు వ‌స్తాయో కూడా చెప్ప‌లేనంతగా అవి తెర‌కెక్కాయి.

అయితే ఈ చిత్రాలు మ‌న దేశానికి సంబంధించిన‌వి అస‌లే కావు. పూర్తిగా హాలీవుడ్ సినిమాలు కాగా ఇలాంటి చిత్రాలు కూడా ఉంటాయా, తీస్తారా అనే డౌటనుమానాలు మాన‌కు రాక మాన‌వు. వీటిలో ఒక‌టి రెండు మాత్రం వేరే దేశాల చిత్రాలు. అంతేగాక‌ ఈ క్రింద పేర్కొన్న వాటిల్లో 90% సినిమాలు ప్ర‌స్తుతం ఏ ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్‌కు లేక‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. ఫ్రీ వెబ్‌సైట్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. ఈ చిత్రాల‌కు సంబంధించిన పోస్ట‌ర్లు, ఫొటోలు కూడా ప‌బ్లిక్‌గా ప్ర‌ద్శించ‌లేనంత డిస్ట‌ర్బెన్స్‌గా ఉంటాయి.


ఇదిలాఉండ‌గా గుండె ధైర్యం, సామ‌ర్థ్యం ఉన్న‌వారు మాత్ర‌మే ఈ సినిమాలు చూడ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తే మంచిది. లేక‌పోతే త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌ను మ‌నం జీర్ణించుకోలేమంటే ఆ చిత్రాలు ఎంత జుగుప్సాక‌రంగా, ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. మాన‌వ మాత్రుడు త‌న జీవితంలో త‌ల‌చ‌ని విధంగా, క‌నీవినీ ఎరుగ‌ని, చూడ‌ని విధంగా వీప‌రిత‌మైన హింసాత్మ‌క‌, శృంగార స‌న్నివేశాతో రూపొందించారు. ఒక‌వేళ మ‌నం ధైర్యం చేసి చూడ‌డం మొద‌లు పెట్టిన ఏదో ఓ సంద‌ర్భంలో మ‌నం వాంతులు చేసుకోవ‌డం ఖాయం. పైపెచ్చు మ‌న మైండ్ కూడా దొబ్బే అవ‌కాశం వంద శాతం ఉంది.

మ‌న‌ల్ని బాగా డిస్ట్ర‌బ్ చేసే, చూడ‌లేని కొన్ని సినిమాలివే

Salò, or 120 Days of Sodom (1975)

I Spit on Your Grave (1978)

Cannibal Holocaust (1980)

Natural Born Killers (1994)

Audition (1999)

Ichi the Killer (2001)

Irréversible (2002)

Hostel (2005)

Strange Circus (2005)

Frontier(s) (2007)

Martyrs (2008)

Antichrist (2009)

The Human Centipede (2009)

A Serbian Film (2011)

Raw (2016)

Updated Date - Mar 19 , 2024 | 06:43 PM