ఈ వారం ఓటీటీలు బ‌ద్ద‌లే.. అన్నీ మ‌డ‌త‌బెట్టించే డ‌బ్బింగ్ సినిమాలే!

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:57 PM

ప్ర‌తి వారం లానే ఈ వారం కూడా స్ట్రెయిట్ చిత్రాల‌తో పాటు చాలా హాలీవుడ్, కోరియ‌న్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు తెలుగులోకి డ‌బ్బ్ అయి స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సారి వాటి సంఖ్య‌ డ‌జ‌న్‌కు పైగానే ఉండ‌నుంది. అవేంటో ఎందులో వ‌స్తున్నాయో చూసేయండి.

ఈ వారం ఓటీటీలు బ‌ద్ద‌లే.. అన్నీ మ‌డ‌త‌బెట్టించే డ‌బ్బింగ్ సినిమాలే!
dubbing movies

ప్ర‌తి వారం లానే ఈ వారం కూడా స్ట్రెయిట్ చిత్రాల‌తో పాటు చాలా హాలీవుడ్, కోరియ‌న్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు తెలుగులోకి డ‌బ్బ్ అయి స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సారి వాటి సంఖ్య‌ డ‌జ‌న్‌కు పైగానే ఉండ‌నుంది. అవేంటో ఎందులో వ‌స్తున్నాయో చూసేయండి.

జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2 (Gyeongseong Creature Part 2) అనే కొరియ‌న్ మాన్‌స్ట‌ర్ క్రియేచ‌ర్ మిస్ట‌రీ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఈ సిరీస్ మొద‌టి సీజ‌న్ రెండు భాగాలుగా వ‌స్తుండ‌గా, మొద‌టి భాగంలో 7 ఎపిసోడ్‌లు డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌వ‌గా సెకండ్ పార్ట్ నుంచి 8, 9, 10 ఎపిసోడ్లు శుక్ర‌వారం నుంచి తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

2021లో వ‌చ్చిన ఏ సవన్నా హాంటింగ్ (A Savannah Hauting) అనే అమెరిక‌న్ హ‌ర్ర‌ర్ సూప‌ర్ న్యాచుర‌ల్ చిత్రం వీఆర్ ఓటీటీ(VROTT App)లో ఫ్రీగా, బుక్‌మైషో (Bms Stream) స్ట్రీమ్‌ల‌లో రెంట్ ప‌ద్ద‌తిలో తెలుగు, త‌మిళ‌, హందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

రీసెంట్‌గా హాలీవుడ్‌లో వ‌చ్చిన వార్ హార్స్ (WarHorseOne (2023) అనే అమెరిక‌న్ వార్ యాక్ష‌న్ డ్రామా జాన‌ర్ చిత్రం ప్ర‌స్తుతం బీఎమ్ఎస్ స్ట్రీమ్ (Bms Stream)లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రెంట్ ప‌ద్ద‌తిలో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.


హాలీవుడ్ స్టార్స్ సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ (TheSlyStallon), జాస‌న్ స్నాథ‌మ్ (Jason Stathom), మేఘ‌నా ఫాక్స్‌, టోనీ జా వంటి ఆగ్ర న‌టులు న‌టించిన ఎక్‌పెండెబుల్స్ 4 Expendables 4 (2023) అనే ఔట్ ఔట్ యాక్ష‌న్ చిత్రం ల‌య‌న్‌గేట్స్ ప్లే (lionsgateplay IN) ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

సొసైటీ ఆఫ్ ది స్నో (Society Of The Snow (2024)) అనే స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix)లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది. ఇది ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌క చూడాల్సిన చిత్రం.

ది బ్ర‌ద‌ర్స్ స‌న్ (TheBrothersSun 2024)) అనే నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ డార్క్ యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్ వెబ్‌ సిరీస్‌లోని 8 ఎపిసోడ్లు ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాస‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌వి.

వెయిట్ లిఫ్టింగ్ ఫెయిరీ కిమ్ బోక్‌జూ (Weight Lifting Fairy Kim BokJoo) అనే కొరియ‌న్ కామెడీ, రొమాన్స్‌, డ్రామా సిరీస్‌లోని మొత్తం 16 ఎపిసోడ్లు ప్ర‌స్తుతం అమెజాన్ మినీ టీవి(Amazon mini TV)లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

టాక్ టూమీ అనే అస్ట్రేలియ‌న్ సూప‌ర్ న్యాచుర‌ల్ హ‌ర్ర‌ర్ చిత్రం అమెజాన్ ప్నైమ్ వీడియోలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ లాంగ్వేజేస్‌లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

మ‌మ్ముట్టి,జ్యోతిక జంట‌గా న‌టించ‌గా గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ థియేట‌ర్‌లో విడుద‌లై రెండు దేశాల‌లో బ్యాన్ చేయ‌బ‌డ్డ కాథ‌ల్ ది కోర్ (Kaathal The Core ) అనే మ‌ళ‌యాళ వివాదాస్ప‌ద‌ చిత్రం ఈ శుక్ర‌వారం రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో మ‌ళ‌యాళంతో పాటు తెలుగు,త‌మిళ‌,క‌న్న‌డ‌,హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది.

స‌తీష్ ప్ర‌ధాన పాత్ర‌లో హ‌ర్ర‌ర్‌, కామెడీ జాన‌ర్‌లో వ‌చ్చిన త‌మిళ హిట్ చిత్రం కంజూరింగ్ క‌న్న‌ప్ప గురువారం (1.01.2024) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో త‌మిళంతో పాటు తెలుగు,మ‌ళ‌యాళం,క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

ప్ర‌ఖ్యాత TVF's నుంచి వ‌స్తున్న క్యూబిక‌ల్స్ సీజ‌న్‌3 Cubicles S3 (2024) సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో అన్ని సౌత్ ఇండియా భాష‌ల్లో ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ (Perilloor Premier League) అనే మ‌ళ‌యాళ వెబ్ సిరీస్ సీజ‌న్1 శుక్ర‌వారం (05.1.2024) నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్ (Disney+ Hotstar)లో మ‌ళ‌యాళంతో పాటు సౌత్ ఇండియా అన్ని భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

స‌ల్మాన్‌ఖాన్, క‌త్రినా ఖైఫ్ జంట‌గా 2023 దీపావ‌ళికి విడుద‌లై మంచి విజ‌యం సాధించిన టైగ‌ర్‌3 అనే బాలీవుడ్ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో((Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది.

వీట‌న్నింటితో పాటు కృష్ణ‌ఘ‌ట్టం, అనే స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆల‌స‌ప్యం ఈ వీకెండ్ మీకు న‌చ్చే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి.

Updated Date - Jan 05 , 2024 | 05:05 PM