Hollywood: ఆ ఇండియన్ ఆస్కార్ సినిమాకి సీక్వెల్..
ABN , Publish Date - Nov 28 , 2024 | 10:19 AM
ఇప్పుడంటే రాజమౌళి సినిమాలతో ఇండియా అంటే విదేశీయులకు మరొక కోణం కనిపించింది కానీ.. ఒకప్పుడు ఇండియా అంటే హిందీ, బాలీవుడ్, బొంబాయితో పాటు మరొక సినిమా మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు ఆ సినిమా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందుకు వార్తల్లో నిలుస్తోందంటే..
2009 రిలీజై ఆస్కార్ వేదికపై ఎనిమిది అవార్డులు కొల్లగొట్టి సంచనలనం సృష్టించిన సినిమా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’. కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కి వెస్ట్రన్ ఆడియెన్స్ దాసోహం అయిపోయారు. మ్యూజిక్ విభాగంలోనూ ఈ సినిమా రెండు అవార్డులను కొల్లగొట్టింది.
అనాథగా పెరిగిన ఓ కుర్రాడు.. తన జీవితంలో ఎదురైన అనుభవాలనే ఆధారంగా చేసుకుని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తరహా గేమ్ షోలో పాల్గొని కోట్లు సంపాదించడం.. మాఫియా వలలో చిక్కుకున్న తన ప్రేయసిని విడిపించుకోవడం.. ఈ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా లాంగ్వేజ్ బేరియర్స్ ని చెరిపేసింది. కాగా, 15 ఏళ్ల తర్వాత డైరెక్టర్ డానీ బోయెల్‌యే సీక్వెల్ కి కథ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ బ్రిడ్జ్ 7 అధికారికంగా ధృవీకరించింది.
ఈ సినిమాలో గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ తో పాటు అనిల్ కపూర్, దేవ్ పటేల్, ఫ్రీదా పింటో, రుబీనా అలీ, మధుర్ మిట్టల్, ఆయుష్ మహేష్ ఖేడేకర్, అజారుద్దీన్ మహమ్మద్ ఇస్మాయిల్ అద్భుతంగా నటించి మెప్పించారు.