మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dog at Oscar 2024: దీనికి వెంటనే ఆస్కార్‌ ఇవ్వండి అంటూ కామెంట్లు!

ABN, Publish Date - Mar 11 , 2024 | 04:52 PM

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ ఆస్కార్‌ వేడుక కనులవిందుగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఓ శునకం అందరి దృష్టిని ఆకర్షించింది. నేటి ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే ప్రస్తావన నడుస్తోంది.

Dog at Oscar 2024:  దీనికి వెంటనే ఆస్కార్‌ ఇవ్వండి అంటూ కామెంట్లు!

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ ఆస్కార్‌ (Oscar) వేడుక కనులవిందుగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఓ శునకం (Messy the Dog) అందరి దృష్టిని ఆకర్షించింది. నేటి ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే ప్రస్తావన నడుస్తోంది. ఆస్కార్‌ కోసం వివిధ విభాగాల్లో పోటీ పడిన చిత్రాల్లో ‘అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌’ ఒకటి. బెస్ట్‌ ఒరిజినల్‌ స్ర్కీన్‌ ప్లే కేటగీరీలో ఇది అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెస్సీ (శునకం) కూడా అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చింది. అంతేకాదు అవార్డులు అందుకున్న వారిని ఎంకరేజ్‌ చేస్తూ చప్పట్లు కూడా కొట్టింది. ఈ వేడుకలో ఇదే ప్రత్యేక ఆకర్షణ అని అతిథులు, ఆహుతులు దానితో ఫొటోలు దిగారు.



ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా నెటిజన్లు దీనిపై ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘దీనికి ఇప్పుడే ఆస్కార్‌ ఇవ్వండి’ అని ఒకరు కామెంట్‌ పెట్టగా.. ‘మెస్సీ ది డాగ్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు తీసుకోడానికి సిద్థంగా ఉంది’ అని మరొకరు పోస్ట్‌ పెట్టారు. ‘ఈ ఏడాది వేడుకల్లో దీని చప్పట్లు బెస్ట్‌ మూమెంట్‌’ అని ఇంకొకరు స్పందించారు. 

Updated Date - Mar 11 , 2024 | 04:52 PM