స్ట్రెయిట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌.. కొరియ‌న్ స‌ర్వైవ‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్! ఎప్ప‌టినుంచంటే

ABN , Publish Date - Jan 18 , 2024 | 04:41 PM

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో కొత్త కొరియ‌న్‌ చిత్రం బాడ్‌ల్యాండ్ హంటర్స్ సిద్ధ‌మైంది. త‌రుచూ కొరియ‌న్ నుంచి వ‌చ్చే కామెడీ,క్రైమ్ థ్రిల్ల‌ర్స్ లాంటి సినిమాలు కాకుండా ఈ సారి కాస్త భిన్న‌మైన డిస్టోపియన్ యాక్షన్ జాన‌ర్‌ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

స్ట్రెయిట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌.. కొరియ‌న్ స‌ర్వైవ‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్! ఎప్ప‌టినుంచంటే
bad land

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో కొత్త కొరియ‌న్‌ చిత్రం బాడ్‌ల్యాండ్ హంటర్స్ (Badland Hunters) సిద్ధ‌మైంది. త‌రుచూ కొరియ‌న్ నుంచి వ‌చ్చే కామెడీ,క్రైమ్ థ్రిల్ల‌ర్స్ లాంటి సినిమాలు కాకుండా ఈ సారి కాస్త భిన్న‌మైన డిస్టోపియన్ యాక్షన్ జాన‌ర్‌ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దక్షిణ కొరియా స్టార్ హీరో మా డాంగ్-సియోక్ (డాన్ లీ) (Ma Dong-seok) హీరోగా న‌టించిన ఈ చిత్రానికి హీయో మ్యుంగ్-హేంగ్ (Heo Myung-haeng) దర్శకత్వం వహించ‌గా లీ హీ-జూన్ (Lee Hee-joon), లీ జున్-యంగ్ (Lee Jun-young), రోహ్ జియోంగ్-ఇయు(Roh Jeong-eui) కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) స్వ‌యంగా నిర్మించిన‌ ఈ బాడ్‌ల్యాండ్ హంటర్స్ (Badland Hunters) చిత్రం 2023లో వ‌చ్చిన‌ కాంక్రీట్ యుతోపియా(Concrete Utopia) సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. తీవ్ర భూకంపం త‌ర్వాత‌ సియోల్ న‌గ‌రం పూర్తిగా మారిపోవ‌డం,. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు అన్నీ ధ్వంసం అవ‌డం, ల‌క్ష‌ల్లో ప్ర‌జ‌లు చ‌నిపోవ‌డం, శాంతిభ‌ద్ర‌త‌లు దెబ్బ‌తిన‌డం ఇలా ప్రతిదీ కుప్పకూలిన క్ర‌మంలో మిగిలిన కొద్ది మంది మ‌నుషులు ఓ ర‌హ‌స్య ప్రాంతంలో నివ‌సిస్తుంటారు. ఈ క్ర‌మంలోవారిపై జంతువులు, జోంబీస్ దాడులు చేయ‌డం వాటి నుంచి త‌ప్పించుకుంటూ ఎలా స‌ర్వైవ్ అయ్యార‌నే క‌థ‌తో సినిమాను ఆద్యంతం ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కిచారు.


ఇంత‌కుముందు మ‌నం చూసిన చాలా జోంబీ, డిజాస్ట‌ర్ చిత్రాల టైపులోనే ఈ బాడ్‌ల్యాండ్ హంటర్స్ (Badland Hunters) సినిమా ఉండ‌నున్న‌ప్ప‌టికీ ఇందులో వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్‌, జోంబీ స‌న్నివేశాలు మ‌రో లెవ‌ల్‌లో ఉన్నాయి. అవుట్ లాస్ ( The Outlaws), ది రౌండ‌ప్ (The Roundup), ట్రైన్ టు బూసాన్ ( Train to Busan) చిత్రాల ద్వారా అంత‌ర్జాతీయంగా పేరు తెచ్చుకున్న డాన్ లీ ఇందులో హీరోగా న‌టించ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌కుండా స్ట్రెయిట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్నారు. జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల‌లో ప్రేక్ష‌కులకు అందుబాటులో ఉండ‌నుంది. సో డోంట్ మిస్ ది మూవీ. ఇప్పుడే మీ వాచ్‌ లిస్టులో యాడ్ చేసుకోండి.

Updated Date - Jan 18 , 2024 | 05:04 PM