John Cena: ఆస్కార్ వేదికపైకి న్యూడ్‌గా జాన్ సీనా.. అవార్డు ప్ర‌ధానం! ఎందుకలా చేశాడంటే?

ABN , Publish Date - Mar 11 , 2024 | 09:07 PM

96వ ఆస్కార్ అవార్డ్ వేడుక ఈ రోజు (సోమవారం) ఉద‌యం లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేట‌ర్‌లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే వేడుక జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎప్ప‌టిలానే ఈ సారి కూడా ఉన్న‌ఫ‌లంగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న అంద‌రినీ షాక్ గురి చేసింది.

John Cena: ఆస్కార్ వేదికపైకి న్యూడ్‌గా జాన్ సీనా.. అవార్డు ప్ర‌ధానం! ఎందుకలా చేశాడంటే?
oscars

96వ ఆస్కార్ (Oscars) అవార్డ్ వేడుక ఈ రోజు (సోమవారం) ఉద‌యం లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేట‌ర్‌లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిస్టోఫర్ నోలన్ తాను సినిమాల్లోకి వ‌చ్చిన దాదాపు ముప్పై సంవ‌త్స‌రాల‌ త‌ర్వాత ఫ‌స్ట్ టైం ఆస్కార్ అందుకోగా, తాను డైరెక్ట్ చేసిన‌ 'ఓపెన్ హైమర్‌‘ మ‌రో ఆరు అవార్డుల‌ను ద‌క్కించుకుని ఆగ్ర భాగాన నిలిచింది. అయితే వేడుక జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎప్ప‌టిలానే ఈ సారి కూడా ఉన్న‌ఫ‌లంగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న అంద‌రినీ షాక్ గురి చేసింది.

GIYFdZyXQAEJbUw.jpeg

గ‌త సంవ‌త్స‌రం జ‌రిగిన‌ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో హాలీవుడ్ టాప్ యాక్ట‌ర్ విల్ స్మిత్ యాంక‌ర్‌ను కొట్టడంతో ఆ ఇష్యూ చాలా రోజులు హాట్ టాపిక్‌గా న‌డిచింది. ఈ క్ర‌మంలో తాజాగా అవార్డుల ప్ర‌ధానోత్స‌వం వైభ‌వంగా సాగుతున్న స‌మ‌యంలో ప్ర‌ముఖ wwe ప్లేయ‌ర్ హాలీవుడ్ స్టార్ జాన్ సీనా (John Cena) ఒంటిపై నూలు పోగు లేకుండా ద‌ర్శ‌ణ‌మిచ్చి అహుతుల‌ను ఉల‌క్కి ప‌డేలా చేశారు. అయితే విన్న‌ర్‌కు బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం జాన్ సీనాకు (John Cena) ఇచ్చారు. ఈ క్ర‌మంలో అ అవార్డును అంద‌జేసేందుకు జాన్‌ సీనా ఒంటిపై బ‌ట్ట‌లు లేకుండా తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా విన్నర్ పేరు రాసి ఉన్న కార్డును అడ్డుగా పెట్టుకుని స్టేజ్ పైకి వ‌చ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడ‌యాలో వైర‌ల్‌గా మారింది.


అయితే త‌ర్వాత మ‌రో వ్య‌క్తి వ‌చ్చి నామినిస్ జాబితాను అనౌన్స్ చేశారు. అనంత‌రం థియేట‌ర్‌ మొత్తం లైట్స్ బంద్ చేసి జాన్ సీనా (John Cena) బ‌ట్ట‌లు వేసుకున్నాక విన్న‌ర్‌ను ప్ర‌క‌టించి పూర్ థింగ్స్ సినిమాలో కాస్ట్యూమ్స్‌కు గాను హోలి వెడ్డింగ్‌టన్‌కు అవార్డు అంద‌జేశారు.

john-cena-oscars-backstage-photos-26.jpg

ఇదిలాఉండ‌గా రియ‌ల్‌గా సినిమాల్లో కాస్టూమ్ డిజైనర్ అవ‌సరం ఎంత ఉంటుంద‌నేది చెప్పేందుకే ఇలా చేయాల్సి వ‌చ్చిందంటూ చివ‌ర‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే ఘ‌ట‌న‌పు చూసి చాలామంది న‌వ్వుకున్న‌ప్ప‌టికీ , విమ‌ర్శ‌లు కూడా అదే స్థాయిలో వ‌స్తున్నాయి. కొట్లాది మంది చూసే ఓ వేదిక‌పై టాప్ స్టార్స్ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రైంది కాదంటు త‌ప్పు ప‌డుతున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 09:19 PM