ప్ర‌పంచ‌మంతా ఎదురుచూస్తున్న సినిమా వ‌చ్చేస్తుంది.. పిల్ల‌ల‌తో క‌లిసి చూసేయండి! డోంట్ మిస్‌

ABN , Publish Date - May 06 , 2024 | 10:05 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్న ఓ భారీ హాలీవుడ్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అదే కింగ్‌డ‌మ్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్.. 2017లో వ‌చ్చిన వార్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ సినిమా వ‌స్తోంది.

ప్ర‌పంచ‌మంతా ఎదురుచూస్తున్న సినిమా వ‌చ్చేస్తుంది.. పిల్ల‌ల‌తో క‌లిసి చూసేయండి! డోంట్ మిస్‌
Kingdom of the Planet of the Apes

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్న ఓ భారీ హాలీవుడ్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అదే కింగ్‌డ‌మ్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (Kingdom of the Planet of the Apes).2017లో వ‌చ్చిన వార్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (War for the Planet of the Apes) చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ సినిమాకు వెస్ బాల్ (Wes Ball) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఓవెన్ టీగ్ (Owen Teague), ఫ్రెయా అల్లన్ (Freya Allan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మే 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల‌లోని ప్ర‌ముఖ‌ భాష‌ల‌న్నింటిలో థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

తాజాగా వ‌స్తున్న సినిమా ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన వాటికకి మిన్న‌గా అంత‌కు మించి అనేలా యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర‌స్ స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకోనుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిని ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను విప‌రీతంగా పెంచేయ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఇప్పుడు ఈ చిత్రం కోసం చాలా అతృత‌తో ఎదురు చూస్తున్నారు. పైగా ఈ మ‌ధ్య వ‌చ్చిన కాంగ్ ది న్యూ ఎంఫైర్ సినిమా మిన‌హా వేరే ఏ ఇత‌ర పెద్ద హాలీవుడ్ చిత్రం విడుద‌ల కాక‌పోవ‌డం, ప్ర‌స్తుత వేస‌వి సెల‌వులు ఈ సినిమాకు మంచిగా క‌లిసొచ్చే అవ‌కాశ‌ము ఉంది.

kingdom-of-the-planet-of-the-apes.jpg


ఈ సిరీస్‌లో 4 వ భాగంగా వ‌స్తున్న ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ (Kingdom of the Planet of the Apes) సినిమా నేప‌థ్యానికి వ‌స్తే ఏప్స్‌ను పాలిస్తున్న ప్రాక్సిమ‌స్ సీజ‌ర్ అధికారంలో మ‌న‌షుల‌పై తీవ్ర‌మైన ద్వేషంలో ఉంటారు. అతేగాక మ‌న‌షుల నూత‌న టెక్నాలిజీని సొంతం చేసుకుంటూ క‌నిపించే ప్ర‌తి మాన‌వుడిని చంపుకుంటూ పోతుంటాయి.

2.png

అయితే ఇది న‌చ్చ‌ని ఓ చింపాంజీ నోవా అనే యువ‌తితో పాటు మ‌రి కొంత‌మంది మనుషుల‌ను ర‌క్షించి నియంత ఏప్‌కు ఎదురు తిరుగుతుంది. చివ‌ర‌కు వారు ప్రాక్సిమ‌స్‌తో ఎలా పొరాడారు, ఎవ‌రు విజ‌యం సాధించార‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాక‌థ‌నాల‌తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా యాక్ష‌న్ సీన్ల‌తో చిత్రాన్ని యచాలా ఇంట్రెస్టింగ్‌గా రూపొందించారు. ఈ మండు వేస‌విలో మీకు స‌మ‌యం ఉన్న‌ప్పుడు మీ పిల్ల‌లతో క‌లిసి మిస్స‌వ్వ‌కుండా చూసేయండి. డోంట్ మిస్‌.

Updated Date - May 06 , 2024 | 10:05 PM