A Quiet Place Day One: ప్ర‌పంచమంతా ఎదురుచూస్తున్న సైన్స్‌ఫిక్ష‌న్‌, హారర్ సినిమా.. థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది

ABN , Publish Date - Jun 25 , 2024 | 05:06 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ అభిమానుల‌ను అల‌రించేందుకు హాలీవుడ్ అపోకలిప్టిక్,సైన్స్‌ఫిక్ష‌న్‌, హారర్ చిత్రం ఏ క్వైట్ ప్లేస్ డే వ‌న్ సినిమా రెడీ అయింది. జూన్ 28న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

A Quiet Place Day One: ప్ర‌పంచమంతా ఎదురుచూస్తున్న సైన్స్‌ఫిక్ష‌న్‌, హారర్ సినిమా.. థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది
A Quiet Place

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ అభిమానుల‌ను అల‌రించేందుకు హాలీవుడ్ అపోకలిప్టిక్,సైన్స్‌ఫిక్ష‌న్‌, హారర్ చిత్రం ఏ క్వైట్ ప్లేస్ డే వ‌న్ (A Quiet Place: Day One) అనే సినిమా రెడీ అయింది. జూన్ 28న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. గ‌తంలో 2018, 2020ల‌లో వ‌చ్చిన ఏ క్వైట్ ప్లేస్ 1, 2 చిత్రాల సిరీస్‌లో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఫ్రీక్వెల్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. మైఖేల్ సర్నోస్కీ (Michael Sarnoski) ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో లుపిటా న్యోంగో (Lupita Nyong'o), జిమోన్ హౌన్సౌ (Djimon Hounsou), అలెక్స్ వోల్ఫ్ (Alex Wolff), జోసెఫ్ క్విన్ (Joseph Quinn) కీల‌క పాత్ర‌లు పోషించారు. సినిమా కేవ‌లం ఇంగ్లీష్‌లో మాత్ర‌మే విడుద‌ల కానుంది. అయితే సినిమాలో డైలాగ్స్ చాలా త‌క్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి వీక్ష‌కుల‌కు భాష స‌మ‌స్య ఉండ‌క‌పోవ‌చ్చు.

A Quiet Place

గ‌తంలో ఈ సిరీస్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు విశ్వ‌వ్యాప్తంగా విశేషంగా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను ద‌క్కించు కోవ‌డ‌మే కాక విడుద‌లైన ప్ర‌తీచోటా క‌లెక్ష‌న్లు సునామీనే సృష్టించింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు రాబోతున్న ఈ మూడ‌వ భాగంపై కూడా అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

A Quiet Place

అయితే ఇందులో గ‌త చిత్రాల‌లో న‌టించిన వారు కాకుండా జిమోన్ హౌన్సౌ (Djimon Hounsou) మిన‌హా అంతా కొత్త వారే ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నుండ‌డం విశేషం. మొద‌టి రెండు భాగాల‌లో చూపులేని ఎలియ‌న్ క్రీచ‌ర్స్ చిన్న సౌండ్ వ‌చ్చినా చాలు ప్ర‌జ‌ల‌పై దాడి చేసి చంపేయ‌డం, వాటి నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ముగ్గురు పిల్లలు ఉన్న త‌ల్లి ఏ విధంగా స‌ర్వైవ్ అయిందో థ్రిల్లింగ్ స‌న్నివేశాల‌తో సినిమా చూసే వారిని సీట్ ఎడ్జ్‌లో కూర్చో బెట్టింది.

A Quiet Place


ఇప్పుడు రాబోతున్న మూడ‌వ పార్ట్‌లో చూపులేని, అల్ట్రాసోనిక్ వినికిడి శ‌క్తి బాగా ఉన్న‌ గ్రహాంతర జీవులు అస‌లు భూమి మీద‌కు ఎలా వ‌చ్చాయి. మాన‌వాళిపై, న‌గ‌రాలపై అవి దాడి చేసి ఎలా స‌ర్వ నాశ‌నం చేశాయి, ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగింద‌నే నేప‌థ్యంలో అదిరిపోయే గ్రాఫిక్స్‌తో సినిమాను తీర్చిదిద్దారు. సినిమా ముఖ్యంగా త‌ప్పిపోయిన త‌న ఫ్యామిలీ మెంబ‌ర్‌ను వెతికే సామ్ అనే మ‌హిళ చుట్టూ తిర‌గ‌నుంది. అంతేకాక చివ‌రి వ‌ర‌కు టెన్సన్ కంటిన్యూ చేస్తూ ఎమోష‌న‌ల్‌, హ‌ర్ర‌ర్ స‌న్నివేశాల‌తో బాగానే భ‌య‌పెడ‌తారు. ఇక క్లైమాక్స్ అంత‌కుమించి అనేలా గత చిత్రాల‌ను మించే థ్రిల్లింగ్ విజువ‌ల్స్‌తో తెరెక్కించారు.

A Quiet Place

మొద‌టి 2 భాగాలకు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌, న‌టుడు జాన్ క్రాసిన్స్కి (John Krasinski) ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు ఓ పాత్ర‌లో న‌టించ‌గా, ఆయ‌న‌ భార్య హాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఎమిలీ బ్లంట్ (Emily Blunt) మెయిన్ లీడ్‌గా న‌టించింది.

A Quiet Place

ఇదిలాఉండగా ఈ చిత్రాన్ని 2023లో మార్చి 31, సెప్టెంబ‌ర్ 22, 2024లో మార్చి 8న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఫైన‌ల్‌గా జూన్ 28న విడుద‌లకు వ‌చ్చేస్తోంది. సో సినీ ల‌వ‌ర్స్ డోంట్ మిస్ దిస్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమా మొద‌టి రెండు భాగాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆస‌క్తి ఉన్న‌వారు ఇప్పుడే చూసేయండి.

Updated Date - Jun 25 , 2024 | 06:40 PM