Sophia Leone: ప్ర‌ముఖ పోర్న్ స్టార్ క‌న్నుమాత‌.. తీవ్ర విషాదంలో అభిమానులు

ABN , Publish Date - Mar 10 , 2024 | 03:09 PM

అడ‌ల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్ (26) క‌న్నుమూసింది. ఈ నెల 1న త‌ను నివాసంలో అచేత‌నంగా ప‌డి ఉండ‌డాన్ని ఆమె స‌వ‌తి తండ్రి మైక్ రొమెరో గుర్తించారు. కానీ ఆమె చ‌నిపోయిన ప‌ది రోజుల త‌ర్వాత ఈ విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

Sophia Leone: ప్ర‌ముఖ పోర్న్ స్టార్  క‌న్నుమాత‌.. తీవ్ర విషాదంలో అభిమానులు
SophiaLeone

ప్ర‌ముఖ అడ‌ల్ట్ ఫిల్మ్‌ స్టార్ సోఫియా లియోన్ (Sophia Leone) (26) క‌న్నుమూసింది. ఈ నెల 1వ తారీఖున అమెరికాలో త‌ను నివాసం ఉంటున్న‌ ఆపార్ట్‌మెంట్‌లో అచేత‌నంగా ప‌డి ఉండ‌డాన్ని ఆమె స‌వ‌తి తండ్రి మైక్ రొమెరో గుర్తించారు. కానీ ఆమె చ‌నిపోయిన ప‌ది రోజుల త‌ర్వాత ఈ విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. సోఫియా మ‌ర‌ణానంత‌రం నిర్వ‌హించాల్సిన కార్య‌క్ర‌మాల కోసం డ‌బ్బులు కావాల‌ని కోరుతూ తండ్రి రొమెరో గో ఫండ్ మి (Go Fund Me) అనే స్వ‌చ్ఛంధ సంస్థ‌కు లెట‌ర్ రాయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ లెట‌ర్‌లోనే సోఫియా మ‌ర‌ణం గురించి ఆయ‌న రాసుకు వ‌చ్చారు.

sofia.jpeg

సోఫియా (Sophia Leone) మ‌ర‌ణంతో ఆమె కుటుంబం దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో ప‌డిపోయింద‌ని, ఆమె సంపాద‌న‌తోనే ఆ ఫ్యామిలీ కాలం వెళ్ల‌దీస్తున్న‌ద‌న్నారు. ఇప్పుడు స‌డ‌న్‌గా సోఫియా మ‌ర‌ణంతో ఆ కుటుంబం షాక్‌లో ఉన్న‌దన్నారు. సోఫియా మ‌ర‌ణానంత‌ర కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి కూడా వారి వ‌ద్ద ఎలాంటి డ‌బ్బులేద‌ని అందుకు కాస్త నిధులు స‌మ‌కూర్చాలంటూ ఆయ‌న స్వ‌చ్ఛంద సంస్థ‌కు రాసిన లెట‌ర్‌లో వివ‌రించారు. సోఫియా మ‌ర‌ణాన్ని ధృవీక‌రిస్తూ ఆమె స్పాన‌ర్స్ మోడ‌లింగ్ 101 అనే ఏజెన్సీ ఓ పోస్టు పెట్టి త‌మ సంతాపాన్ని తెలియ‌జేసింది.


ఇదిలాఉండ‌గా.. అమెరికాలోనే క‌డు పేద‌రిక కుటుంబంలో పుట్టిన సోఫియా (Sophia Leone) ఇల్లు గ‌డ‌వ‌డం కోసం త‌న 18వ యేట అడ‌ల్ట్ ఫిల్మ్‌ల‌లో న‌టించ‌డం మొద‌లు పెట్టి.. అన‌తికాలంలోనే ఆ ఫీల్డ్‌లో తారా స్థాయికి చేరింది. అంతేగాక‌ ప్ర‌పంచ స్థాయిలో చాలామంది అభిమానుల‌ను సంపాదించుకుని త‌న‌కంటూ ప్ర‌త్యేక క్రేజ్ ఏర్ప‌ర్చుకుంది. సోఫియా ఓ వైపు సినిమాల‌లో బిజీగా ఉంటూనే సామాజిక, సేవా కార్య‌క్ర‌మ‌ల‌లో పాల్గొని త‌న‌వంతు సాయం చేసేది. ఇప్పుడు ఆమె అకాల మ‌ర‌ణంతో కుటుంబంతో పాటు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

SophiaLeone 1.jpeg

అయితే.. సోఫియా (Sophia Leone) మ‌ర‌ణంపై అభిమానులు, త‌న మోడ‌లింగ్ ఏజెన్సీ అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ నేప‌థ్యంలో స్థానిక పోలీసులు విభిన్న కోణాల్లో ఈ కేసును ప‌రిశోధిస్తున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌రానున్నాయి. ఇదిలాఉండ‌గా సోఫియా మ‌ర‌ణంతో ఈ యేడు చ‌నిపోయిన అడ‌ల్ట్ స్టార్స్ సంఖ్య నాలుగుకు చేరింది. అంత‌కుముందు కాగ్నీ లిన్ కార్టర్ (Kagney Linn Karter), జెస్సీ జేన్ (Jesse Jane), తైనా ఫీల్డ్స్ (Thaina Fields) వంటి మంచి గుర్తింపు ఉన్న వారే కావ‌డం విశేషం.

SophiaLeone.jpeg

ఇలా వ‌రుస‌గా వీరంతా మ‌ర‌ణించ‌డంపై నెట్టింట చాలామంది త‌మ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు. ఇలాంటి క‌ష్టం ఏ ప‌గ వాడికి కూడా రాకూడ‌దు అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు. అయితే మ‌రో మాజీ పోర్న్‌ స్టార్ ఇప్పుడు బాలీవుడ్ న‌టీమ‌ణి స‌న్నీ లియోన్‌, మ‌ర‌ణించిన‌ సోఫియా లియోన్ పేర్లు ఒక ర‌కంగానే ఉండ‌డంతో చాలామంది వీరిద్ద‌రు బంధువుల‌ని బాగా చ‌ర్చ న‌డుస్తోంది కానీ వారిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి రిలేష‌న్ లేదు. అలాగే వారం రోజుల క్రితం సోఫియా ఓ మీడియా ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఇండియా సోష‌ల్‌మీడియాలో సోఫియా పేరు అగ్ర స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

Updated Date - Mar 10 , 2024 | 03:30 PM