మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Deadpool And Wolverine: ఈసారి మాములుగా ఉండ‌దు..అదిరిపోయిన లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం ట్రైల‌ర్‌

ABN, Publish Date - Apr 23 , 2024 | 02:46 PM

హాలీవుడ్ మార్వెల్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్. యాక్ష‌న్ ప్రియుల‌ను అల‌రించేందుకు మ‌రో చిత్రం సిద్ధమైంది.

Deadpool And Wolverine

హాలీవుడ్ మార్వెల్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్. యాక్ష‌న్ ప్రియుల‌ను అల‌రించేందుకు మ‌రో చిత్రం సిద్ధమైంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మ‌రో సూప‌ర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్ప‌టికే ఈ యూనివర్స్ నుంచి వ‌చ్చిన డెడ్‌పూల్ (Deadpool Movie) సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ (Deadpool and Wolverine).

ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్పైడ‌ర్‌మ్యాన్‌, సూప‌ర్ మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్ చిత్రాల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో అదే క్రేజ్ ఉన్న సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్స్ ఈ ‘డెడ్‌పూల్‌కు, వోల్వారిన్ (Deadpool and Wolverine).. ఇప్ప‌టివ‌ర‌కు 2 డెడ్ పూల్ (Deadpool Movie) చిత్రాలు రాగా , 7 వోల్వ‌రిన్ (Wolverine) సినిమాలు వ‌చ్చాయి. అయితే తాజాగా వ‌స్తున్న మూవీలో ఈ రెండు సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్స్ మెయిన్ లీడ్‌లో రానుండ‌డం విశేషం. మాములుగా సినిమాలో ఒక సూప‌ర్ హీరోనే ఉంటే ఉండే యాక్ష‌న్ సీన్స్ ఉంటుండ‌గా ఇప్పుడు ఇద్ద‌రు హీరోలు ఉంటుండ‌డంతో ఫైటింగ్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయ‌ని స‌గ‌టు సినీ ప్రేక్ష‌కులు ఇప్ప‌టి నుంచే అంచ‌నాలు వేసుకుంటున్నారు.


ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్ (Ryan Reynolds), హ్యూగ్ జాక్‌మాన్ (Hugh Jackman) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. షాన్ లెవీ (Shawn Levy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించగా తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.

ఫుల్ యాక్ష‌న్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్ (Deadpool Movie)గా ర్యాన్ రేనాల్డ్స్ (Ryan Reynolds), వోల్వ‌రిన్ (Wolverine)గా హాలీవుడ్ మ‌రోసారి త‌మ స్టంట్స్‌తో మెస్మ‌రైజ్ చేయ‌డానికి రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ త‌దిత‌రులు ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు.జులై 26న డెడ్‌పూల్ & వోల్వారిన్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Updated Date - Apr 23 , 2024 | 02:46 PM