Deadpool And Wolverine: ఈసారి మాములుగా ఉండదు..అదిరిపోయిన లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం ట్రైలర్
ABN , Publish Date - Apr 23 , 2024 | 02:46 PM
హాలీవుడ్ మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. యాక్షన్ ప్రియులను అలరించేందుకు మరో చిత్రం సిద్ధమైంది.
![Deadpool And Wolverine: ఈసారి మాములుగా ఉండదు..అదిరిపోయిన లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం ట్రైలర్](https://media.chitrajyothy.com/media/2024/20240413/deadfool_wolvarine_1f535bd151.jpg)
హాలీవుడ్ మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. యాక్షన్ ప్రియులను అలరించేందుకు మరో చిత్రం సిద్ధమైంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూల్ (Deadpool Movie) సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ (Deadpool and Wolverine).
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్పైడర్‌మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్ చిత్రాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అదే క్రేజ్ ఉన్న సూపర్ హీరో క్యారెక్టర్స్ ఈ ‘డెడ్‌పూల్‌కు, వోల్వారిన్ (Deadpool and Wolverine).. ఇప్పటివరకు 2 డెడ్ పూల్ (Deadpool Movie) చిత్రాలు రాగా , 7 వోల్వరిన్ (Wolverine) సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా వస్తున్న మూవీలో ఈ రెండు సూపర్ హీరో క్యారెక్టర్స్ మెయిన్ లీడ్‌లో రానుండడం విశేషం. మాములుగా సినిమాలో ఒక సూపర్ హీరోనే ఉంటే ఉండే యాక్షన్ సీన్స్ ఉంటుండగా ఇప్పుడు ఇద్దరు హీరోలు ఉంటుండడంతో ఫైటింగ్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయని సగటు సినీ ప్రేక్షకులు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.
ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్ (Ryan Reynolds), హ్యూగ్ జాక్‌మాన్ (Hugh Jackman) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. షాన్ లెవీ (Shawn Levy) దర్శకత్వం వహించారు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్‌టైనమెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించగా తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.
ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్ (Deadpool Movie)గా ర్యాన్ రేనాల్డ్స్ (Ryan Reynolds), వోల్వరిన్ (Wolverine)గా హాలీవుడ్ మరోసారి తమ స్టంట్స్‌తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.జులై 26న డెడ్‌పూల్ & వోల్వారిన్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.