77th Canes Film Festival: ఈ సారి రెండు భారతీయ చిత్రాలు.. ఎప్పటి నుంచి అంటే!

ABN , Publish Date - May 13 , 2024 | 03:44 PM

ప్రపంచంలోని సినీ పరిశ్రమలన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Canes Film Festival) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకూ ఈ చిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

77th Canes Film Festival: ఈ సారి రెండు భారతీయ చిత్రాలు.. ఎప్పటి నుంచి అంటే!

ప్రపంచంలోని సినీ పరిశ్రమలన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Canes Film Festival) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకూ ఈ చిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 'ది సెకెండ్‌ యాక్ట్‌’ (The second act)చిత్రంతో ఈ చిత్రోత్సవాలు మొదలు కానున్నాయి. ఈసారి రెండు భారతీయ చిత్రాలు పోటీ పడనున్నాయి. రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సిస్టర్‌ మిడ్‌నైట్‌’ (Sister midnight) సినిమా ‘డైరెక్టర్స్‌ పార్టునైట్‌’ (Directors Partnight) కేటగిరీలో స్క్రీనింగ్ కానుంది. దీనికి కరణ్‌ కాంధారి దర్శకుడు. భారత్‌ నుంచి ఈ విభాగానికి సెలెక్ట్‌ అయిన ఒకే ఒక చిత్రమిది.

Radhika.jpg
కోటి ఆశలతో కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి అనుకోని సమస్యల్లో ఇరుక్కొని.. దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవటానికి ఏం చేసిందో ఇందులో చూపించారు. హాస్యం, ప్రేమలకు సైతం ఇందులో చోటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  వెల్లింగ్టన్‌ ఫిల్మ్స్‌, రాధికా ఆప్టే, సూటబుల్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించారు. అలాగే మరోవైపు సిక్కిం దర్శకుడు సామ్తెన్‌ భుటియా దర్శకత్వం వహించిన ‘తార: ది లాస్ట్‌ స్టార్‌’ ప్రదర్శనకు బరిలో ఉంది. సావిత్రీ ఛెత్రీ నిర్మించారు. హిమాలయ పర్వత సానువులు, సిక్కిం రాష్ట్రంలో ప్రజల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సోషల్‌ డ్రామాని తెరకెక్కించాం. ఆ ప్రాంత వాసులే ప్రధాన పాత్రలు పోషించారు’’ అని దర్శకుడు అన్నారు. 


తాజాగా మంచి విష్ణు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. కేన్స్  ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో 'ది వరల్డ్‌ కన్నప్ప’ను  ఈ నెల 20న లాంచ్ చేయనున్నట్లు మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. కేన్స్ లో  సినిమాను లాంచ్  చేయడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని ఆయన చెప్పారు. 

Updated Date - May 13 , 2024 | 03:44 PM