ప్రపంచం చూపంతా ఇప్పుడు ఈ సినిమాపైనే.. పిల్ల‌ల‌కు ఇక పండ‌గే.

ABN , Publish Date - Mar 28 , 2024 | 10:11 PM

మాములుగా హాలీవుడ్ చిత్రాల‌కు ఉండే క్రేజ్ స‌ప‌రేటు.. న‌చ్చితే సొంత లాంగ్వేజ్ సినిమాల‌కు మించి క‌లెక్ష‌న్లు ముట్ట‌జెబుతారు. ఈ విష‌యం ఇప‌ప‌ప్టికే చాలా సినిమాల విష‌యంలో రుజువైంది కూడా. ఇప్పుడు ఇదే కోవ‌లో ఇప్పుడు ఓ చిత్రం రాబోతుంది.

ప్రపంచం చూపంతా ఇప్పుడు ఈ సినిమాపైనే.. పిల్ల‌ల‌కు ఇక పండ‌గే.
Godzilla x Kong: The New Empire (2024)

మాములుగా హాలీవుడ్ చిత్రాల‌కు ఉండే క్రేజ్ స‌ప‌రేటు.. న‌చ్చితే సొంత లాంగ్వేజ్ సినిమాల‌కు మించి క‌లెక్ష‌న్లు ముట్ట‌జెబుతారు. ఈ విష‌యం ఇప‌ప‌ప్టికే చాలా సినిమాల విష‌యంలో రుజువైంది కూడా. ఇప్పుడు ఇదే కోవ‌లో ఇప్పుడు ఓ చిత్రం రాబోతుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ (Godzilla x Kong: The New Empire) మాత్ర‌మే.

ఎన్న‌డు లేనంత‌గా చాలా మంది ప్రేక్ష‌కులు ఈ చిత్రం విడుద‌ల కోసం వెయిట్ చేస్తున్నారు. గ‌తంలో అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ సినిమాకు ఎలా అయితే అభిమానులు ఎదురు చూశారో ఇప్పుడు అంత‌కుమించి అనేలా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగ‌ర్లీ వెయిట్ చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. గ‌త వారం ప‌దిరోజులుల‌గా ఈ సినిమాపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ వీప‌రీతంగా న‌డుస్తోండ‌గా యూట్యూబ్‌లో అయితే వేలు, ల‌క్ష‌ల్లోనే వీడియోలు పెడుతున్నారు ఫ్యాన్స్‌.

godzilla-x-kong.jpg

అయితే.. హాలీవుడ్‌ చిత్రాల్లో ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ (Godzilla x Kong: The New Empire) చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఈ తరహా చిత్రాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆదరిస్తారు. ఈ సిరీస్‌ల‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. అదే వ‌రుస‌లో ఇప్పుడు వస్తున్న మరో భారీ చిత్రం ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌ - ది ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire) మూవీ. శుక్ర‌వారం (March 29)న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

గ‌త చిత్రాల‌కు మిన్న‌గా యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్ సీన్స్ ఈ సినిమాలో ఉంటుండ‌గా , గాడ్జిల్లాను మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్‌గా చూయించ‌నున్నారు. అలాంటి గాడ్జిల్లాను ఎదుర్కొవ‌డానికి కాంగ్ చేసే పోరాటాలు, మ‌ధ్య‌లో సైంటిస్టులు కాంగ్‌కు సాయంగా రావ‌డం త‌దిత‌ర ఆస‌క్తి అంశాల‌తో సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు ఆడమ్‌ వింగార్డ్‌ దర్శకత్వం వహించగా, లెజెండరీ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. ఈ చిత్రంలో రెబెకా హాల్‌, బ్రియాన్‌ టైరీ హెన్రీ, డాన్‌ స్టీవెన్స్‌, కైలీ హాట్లీ, అలెక్స్‌ ఫెర్న్స్‌, ఫలచెన్‌ తదితరులు నటించారు.


ఇందులో గాడ్జిల్లాకు(Godzilla x Kong: The New Empire) సరికొత్త రూపాన్ని ఇవ్వడం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘గతంలో వచ్చిన చిత్రాలకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించాం. ఈ సినిమా టైటాన్స్‌ చరిత్ర, వాటి మూలాలు, స్కల్‌ ఐలాండ్‌ అంతర రహస్యాలను మరింత లోతుగా విశ్లేషించేలా ఉంటుంది. ఈనెల 29వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.

godzilla-x-kong-has-a-new-title-and-an-official-reveal-trail_8123.1280.webp

ప్రధాన పాత్రను పోషించిన రెబాకా హాల్‌ మాట్లాడుతూ.. ‘ఆడమ్‌ వింగార్డ్‌ దర్శకత్వంలో నటించడం నాకు ఎపుడూ సంతోషమే. ఆయన అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుడు. ఆయన షూట్‌ చేసే ప్రతి సన్నివేశం ఎంతో క్లియర్‌గా ఉంటుంది. ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులోని గ్రాఫిక్స్‌ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 10:29 PM