రష్మిక మందన్నతో పెళ్లి గురించి విజయ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 20 , 2024 | 10:11 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరిలో జరగనుండగా? ఇంతకు ముందు కూడా ఆ జంట గురించి ఇలానే వార్తలు వైరల్ అయ్యాయి, కానీ అప్పుడు విజయ్ మాట్లాడలేదు, ఈసారి మాత్రం పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసాడు.

రష్మిక మందన్నతో పెళ్లి గురించి విజయ్ సంచలన వ్యాఖ్యలు
File picture of Rashmika Mandanna and Vijay Deverakonda

సంచలనం సృష్టించిన తెలుగు నటుడు విజయ్ దేవరకొండ, చాలా తక్కువ కాలంలోనే దేశం అంతా పేరు మారుమోగి పోయేట్టు తన నటనతో మెప్పించాడు. ఈమధ్య విజయ్ దేవరకొండ వార్తల్లో ఉంటూ వస్తున్నాడు. ముఖ్యంగా తన సహచర నటి రష్మిక మందన్నని వివాహం చేసుకోబోతున్నాడు అని. అయితే ఈ వార్త ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చాలాసార్లు కొన్ని మీడియా వెబ్ సైట్స్ లో వైరల్ అయ్యాయి. విజయ్ ఇలాంటి వార్తలకి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండేవాడు. (Vijay Deverakonda responded about his marriage rumours with Rashmika Mandanna)

కానీ మళ్ళీ ఈ వార్త వైరల్ అయింది. ఈసారి ఫిబ్రవరిలో వివాహం జరగబోతోంది అని ఒక గాసిప్ వెబ్ సైట్ రాసింది. విజయ్ రెండు మూడు సినిమాలతో చాలా బిజీగా వున్నాడు, అలాగే రష్మిక కూడా 'యానిమల్' అనే సినిమాతో పెద్ద విజయం సాధించి దేశం అంతా తన పేరు మారుమోగేట్టు చేసింది. ఆమె ఇప్పుడు అటు బాలీవుడ్ లోనూ, ఇటు దక్షిణాదిలోనూ చాలా బిజీగా వుంది. ఈ సమయంలో మళ్ళీ ఈ జంట మీద పెళ్లి వార్త రావటంతో ఈసారి విజయ్ స్పందించాడు.

vijayrashmika1.jpg

ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, విజయ్ దేవరకొండ ఈ పుకార్లకు ఒక చెక్ పెట్టేడు అని చెప్పాలి. తాను రష్మిక మందన్నను పెళ్లాడబోతున్నాడని సూచించే అన్ని పుకార్ల గురించి క్లియర్ చేశాడు. ‘‘ఈ రానున్న ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం గానీ పెళ్లి గానీ జరగడం లేదు. ఇలా ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని చాలా మీడియా వాళ్ళు భావిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇలాంటి పుకార్లు నేను ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాను. వాళ్లు నేను దొరికితే నన్ను పట్టుకొని పెళ్లి చెయ్యడానికి ఎదురు చూస్తున్నట్టున్నారు," అని చెప్పాడు విజయ్.

ఈ సమాధానంతో అతను తన పెళ్లి గురించి వచ్చిన పుకార్ల గురించి మరోసారి స్పష్టంగా చెప్పేసాడు. ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉంటూ తమ పనిలో తాము ఉన్నామని, ఇప్పుడిప్పుడే పెళ్లి గురించిన ప్రస్తావన లేదని చెప్పేసాడు విజయ్ దేవరకొండ.

Updated Date - Jan 20 , 2024 | 10:11 AM