Sunil: డే అండ్ నైట్ షూట్ చేస్తున్న సునీల్, విమానంలో నిద్ర

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:12 PM

రాజమండ్రి నుండి హైదరాబాదు, హైదరాబాదు నుండి గోవా, గోవా నుండి మళ్ళీ హైదరాబాదు, రాజమండ్రి ఇలా ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి పరుగులు పెడుతూ మూడు నాలుగు సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు సునీల్. మరి రెస్టు ఎక్కడ అంటే, విమానంలో నిద్ర పోతున్నారు అని తెలిసింది.

Sunil: డే అండ్ నైట్ షూట్ చేస్తున్న సునీల్, విమానంలో నిద్ర
Actor Sunil

సునీల్ ఇప్పుడు చాలా బిజీగా వుండే నటుల్లో ఒకరు. విడుదలైన మూడు సినిమాల్లో ఒక సినిమాలో సునీల్ కచ్చితంగా కనపడుతున్నాడు. నిన్న విడుదలైన 'హరోం హర' సినిమాలో సునీల్ ఒక ముఖ్యపాత్రలో కనపడతాడు. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సునీల్ సస్పెండ్ అయిన పోలీసు కానిస్టేబుల్ పళని పాత్రలో కనపడతాడు. మొదటి నుండి చివరి వరకు వుండే పాత్ర సునీల్, అలాగే సినిమాలో సుధీర్ బాబు తరువాత అతి ముఖ్యమైన పాత్ర సునీల్ దే.

షూటింగ్స్ లో కూడా అంతే బిజీగా సునీల్ ఉన్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'గేమ్ చంగెర్' చిత్రీకరణలో పాల్గొనడానికి రాజమండ్రిలో కొన్ని రోజులు సునీల్ కనపడతారు. తరువాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' చిత్రీకరణ కోసం కొన్ని రోజులు హైదరాబాదు వస్తారు. ఒక్కోసారి అక్కడ డే షూటింగ్ చేసి, మళ్ళీ రాత్రికి హైదరాబాదు వచ్చి ఇక్కడ నైట్ షూటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

actorsunilone.jpg


ఈ రెండు సినిమాలు కాకుండా గోవాలో 'మ్యాడ్ 2' చిత్రీకరణ జరుగుతోంది. ఆ సినిమాలో కూడా సునీల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ కోసం మళ్ళీ గోవా వెళుతున్నారు. అక్కడ ఒకటి రెండు రోజులు చిత్రీకరణ అయ్యాక, మళ్ళీ హైదరాబాద్, ఆ తరువాత రాజమండ్రి ఇలా తిరుగుతూనే వున్న సునీల్, విమానంలో నిద్రపోతున్నట్టుగా తెలుస్తోంది.

ఒక్క తెలుగులోనే కాదు, తమిళ సినిమాల్లో కూడా సునీల్ బాగా బిజీ అయిపోయారు. ఈ సంవత్సరం మలయాళం సినిమాలో కూడా అరంగేట్రం చేస్తున్నారు సునీల్. ఇలా తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు చేసుకుంటూ, వైవిధ్యమైన పాత్రల్లో కనపడుతూ, ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి ప్రయాణాలు చేస్తూ, విమానంలో నిద్రపోతూ అందరికీ సమానంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు సునీల్.

Updated Date - Jun 15 , 2024 | 05:13 PM