Sundeep Kishan: సందీప్ కిషన్ పేరు వైరల్ అవుతోంది, దీనికోసమేనా...

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:43 AM

నిన్నటి నుండి 'ఊరు పేరు భైరవకోన'లో కథానాయకుడిగా చేసిన సందీప్ కిషన్ పేరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ అతని పేరు ఎందుకు వైరల్ అవుతోంది అంటే...

Sundeep Kishan: సందీప్ కిషన్ పేరు వైరల్ అవుతోంది, దీనికోసమేనా...
Sundeep Kishan

గత రెండు రోజుల నుండి సందీప్ కిషన్ పేరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అతను ఈమధ్యే చేసిన 'ఊరు పేరు భైరవకోన' విడుదలైంది, ఈ సినిమాపై సందీప్ ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. విఐ ఆనంద్ దర్శకుడు, రాజేష్ దందా నిర్మాత. ఈ సినిమా విమర్శకులకు మెప్పించలేకపోయింది, కానీ ఈ సినిమా నిర్వాహకులు మాత్రం ఈ చిత్రం డబ్బులు బాగా కలెక్టు చేసిందని ప్రకటనలు ఇచ్చారు. ఇందులో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు.

ఇదిలా ఉండగా సందీప్ కిషన్ తన తదుపరి సినిమా 'ధమాకా' దర్శకుడు నక్కిన త్రినాథ రావు తో చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తారని కూడా అంటున్నారు. రాజేష్ దందా కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో ఉంటారని వినికిడి. ఈ సినిమా కథ బెజవాడ ప్రసన్నకుమార్ రాసారని, ఇంతకు ముందు ఇదే కథ ప్రముఖ క్యారెక్టర్ నటుడు రావు రమేష్ తో పాటుగా ఒక కుర్ర హీరోతో చెయ్యాలని అనుకున్నట్టుగా తెలిసింది. అయితే ఇదే కథ చిరంజీవి, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్ లో, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చెయ్యాలని అనుకున్నారు, కానీ ఎందుకో అది మరి కుదరలేదు.

sundeepkishan.jpg

ఇప్పుడు ఇదే కథ మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగా సమాచారం. రావు రమేష్ ప్రధానపాత్రలో, ఇప్పుడు సందీప్ కిషన్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇది తండ్రీ కొడుకుల కథ అని, చాలా వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. నక్కిన త్రినాథ రావు విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు, అదీ కాకుండా వినోదాత్మకంగా కూడా తీస్తారు అని ఇంకో మంచి పేరు కూడా వుంది. ఇప్పుడు ఈ సందీప్ కిషన్, రావు రమేష్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి అతను దర్శకుడు. అందుకే సందీప్ కిషన్ పేరు వైరల్ అవుతోంది అని ఒక భోగట్టా!

Updated Date - Feb 26 , 2024 | 11:43 AM