Samantha: స‌మంత ఆ బాత్ ట‌బ్‌ ఫొటో ఎందుకు డిలీట్ చేసింది.. సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ ర‌చ్చ‌

ABN , Publish Date - May 08 , 2024 | 09:04 AM

సినిమాల‌తోనే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌తోనూ త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తుంది టాలీవుడ్ బ్యూటీ స‌మంత. తాజాగా స‌మంత బాత్ టవల్ చుట్టుకుని ఉన్న ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేయడంతో ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

Samantha: స‌మంత ఆ బాత్ ట‌బ్‌ ఫొటో ఎందుకు డిలీట్ చేసింది.. సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ ర‌చ్చ‌
samantha

సినిమాల‌తోనే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌తోనూ త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తుంది టాలీవుడ్ బ్యూటీ స‌మంత (Samantha). అంత‌క‌మునుపు ఫ్యామిలీమెన్ సిరీస్‌తో మొద‌టి సారి వార్త‌ల్లోకెక్కిన స‌మంత ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో విడాకులు, పుష్ఫ సినిమాలో ఐటం సాంగ్‌, ఆపై ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో నిత్యం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా ఉంటూ వ‌స్తోంది. తాజాగా స‌మంత బాత్ టవల్ చుట్టుకుని ఉన్న ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేయడంతో ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

మ‌యోసైటిస్ అనే వ్యాధితో కోలుకుంటున్న స‌మంత (Samantha) ఇంకా ట్రీట్‌మెంట్ తీసుకుంటునే ఇప్ప‌టికే అంగీక‌రించిన సిరీస్‌లు, సినిమాల‌లో న‌టిస్తుంది. అయితే త‌న హెల్త్ విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్న స‌మంత అందుకు గాను త‌న‌కు దొరుకుతున్న ప్ర‌తీ అవ‌కాశాన్ని ఉప‌యోగించు కుంటోంది. ఈ క్ర‌మంలోనే కొంత‌కాలంగా ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్‌ చేస్తుంది. ఈ బాత్ వ‌ళ్ల వల్ల మ‌నిషిలో రక్త ప్రసరణ, మెటబాలిజం, మజిల్ స్ట్రెంత్ పెరగడం వంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని తెలియ‌జేస్తూ బాత్ టవల్ చుట్టుకుని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న‌ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

GMzvIHSXgAAMmdp.jpeg


GMzvMTAX0AAM63S.jpeg

ఇప్పుడు ఈ ఫొటోలే సోష‌ల్ మీడియాను బాగా షేక్‌ చేస్తున్నాయి. అయితే స‌మంత (Samantha) చేసిన పోస్టుల‌లో అనుకోకుండా బాత్ ట‌బ్‌లో న్యూడ్‌గా ఉన్న ఫొటో కూడా వ‌చ్చింద‌ని, త‌ర్వాత దానిని తొల‌గించిందంటూ నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది. ఇదిలాఉండ‌గా స‌ద‌రు ఫొటోలో మొహం ఎవ‌రితో తెలియ‌కుండా ఉండ‌గా మెడ‌లో మాత్రం స‌మంత ధ‌రించే చైన్ క‌నిపిస్తుండ‌డంతో ఆ ఫొటోలో ఉన్న‌ది స‌మంతే అంటూ ఆ డిలీట్ చేసిన ఫొటోను చూపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత (Samantha) బాత్ టవల్‌తో ఉన్న ఫొటోల‌ను మాత్ర‌మే పోస్టు చేసింద‌ని ఎలాంటి న్యూడ్ ఫొటోలు షేర్‌ చేయ‌లేద‌ని, ఎవ‌రో కావాల‌ని మార్ఫింగ్ చేశారంటూ అస‌లు ఫొటోను కూడా షేర్ చేస్తూ ఇలాంటి అస‌త్య ప్ర‌చారాల‌ను న‌మ్మొద్ద‌ని అభిమానులు కోరుతున్నారు.

Updated Date - May 08 , 2024 | 09:17 AM