Samantha: సమంత గ్లామ్ ఫోటోలు వైరల్, ఇక తెలుగులో లేనట్టేగా

ABN , Publish Date - Apr 12 , 2024 | 02:42 PM

సమంత హిందీ సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసారని ఒక టాక్ నడుస్తోంది. అందుకోసమే ఆమె ఫోటోషూట్ చేస్తూ అందమైన ఫోటోలని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారని వినికిడి. దీన్ని బట్టి సమంత ఇక దక్షిణాదిలో సినిమాలు చెయ్యకపోవచ్చు అని కూడా ఇంకో వార్త హల్ చల్ చేస్తోంది

Samantha: సమంత గ్లామ్ ఫోటోలు వైరల్, ఇక తెలుగులో లేనట్టేగా
Samantha new photos goes viral on social media

సమంత రుత్ ప్రభు సినిమాలు ఏమీ కొత్తగా ఒప్పుకోలేదు కానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా చురుకుగా వుంటున్నారు. కొత్త కొత్త ఫోటో షూట్స్ చేసి అవి తన అభిమానులకోసం తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అందంగా, గ్లామర్ గా కనపడే ఫోటోలు షేర్ చేశారు సమంత. ఇవి ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ అవుతూ కనిపిస్తున్నాయి. సమంత తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫోటోలకి 'ఇట్స్ ఫ్యాషన్ బేబీ' అంటూ ఒక మూడు మాటలు కూడా రాశారు.

samanthaglamaour.jpg

అయితే ఇంతవరకు ఆమె షేర్ చేసిన ఫోటోలు ఒక ఎత్తయితే, తాజాగా ఫోటోషూట్ చేసిన ఈ ఫోటోలు ఒక ఎత్తు అని ఒక టాక్ వినపడుతోంది. మయోసిటిస్ అనే వ్యాధి నుండి కోలుకున్నాక సమంత అసలు పూర్తిగా ముంబై పైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తూ ఉండటం, అక్కడే ఫోటోషూట్ లు చేస్తూ ఉండటం చూస్తుంటే సమంత దృష్టి బాలీవుడ్ పైనే పడింది అని అప్పుడప్పుడే అనుకున్నారు.

samanthaglam.jpg

అయితే ఇప్పుడు ఈ తాజా ఫోటోషూట్ చూసాక సమంత ఇక తెలుగు సినిమాలు చేయరేమో అని నిర్ధారించినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ లో ప్రయత్నాలు చెయ్యడానికే సమంత ఇటువంటి గ్లామర్ ఫోటోలు తన సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని ఒక వార్త నడుస్తోంది. అలాగే ముంబైలో సమంత తో వెబ్ సిరీస్ చేసిన దర్శకులు సమంతని ఎలా అయినా సమంతని ఒక హిందీ సినిమాలో తీసుకునేట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది.

samanthaglamphoto.jpg

తాజాగా సమంత నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవనుంది అని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసమని సమంత ముంబై వెళుతున్నారు అని చెపుతున్నా, ఇంకో పక్క హిందీ చిత్రాల్లో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అని అంటున్నారు. తమిళ సూపర్ స్టార్ విజయ్, దర్శకుడు వినోద్ తో తీయబోయే సినిమాలో చాలామంది కథానాయకురాళ్ళతో పాటు సమంత కూడా ఉండొచ్చు అనే వార్త ఒకటి వైరల్ అవుతూ వుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు.

Updated Date - Apr 12 , 2024 | 02:42 PM