Samantha: ఇక టాలీవుడ్‌కి బై చెప్పినట్టేనా...

ABN , Publish Date - Mar 21 , 2024 | 04:00 PM

మయోసిటిస్ వ్యాధి నుండి కోలుకున్నాక, సమంత ఎక్కువగా ముంబైలో కనపడుతున్నారు. ఇక టాలీవుడ్ కి వీడ్కోలు పలికే దిశగా వున్నారని సమాచారం. ముంబైకి మకాం కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనపడుతోంది

Samantha: ఇక టాలీవుడ్‌కి బై చెప్పినట్టేనా...
Samantha Ruth Prabhu

తెలుగులో అగ్ర నటీమణుల్లో ఒకరైన సమంత ప్రస్తుతం తనకి వచ్చిన మయోసిటిస్ వ్యాధి నుండి కోలుకున్నారు, మామూలుగానే చాలా ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు కూడా. అలాగే ఈమధ్య తను నటించిన హిందీ వెబ్ సిరీస్ 'సిటాడెల్' కి 'హానీ బన్నీ' అని పేరు కూడా పెట్టారు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నటీనటులందరినీ ఒక వేదికపైకి పిలిచి తమ ఓటిటి లో ప్రసారం కానున్న వెబ్ సిరీస్ లు, సినిమాలు ప్రకటించింది. ఆ ఈవెంట్ లో సమంత కూడా సందడి చేసింది.

samanthanew.jpg

ఇప్పుడు సమంత పూర్తి ఆరోగ్యవంతురాలుగా కనపడుతోంది, కానీ మరి సినిమాలు ఏమైనా చేస్తున్నారా అంటే, ప్రస్తుతమైతే సమంత చేతిలో ఏ ప్రాజెక్టులు లేవు అనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సదస్సుకు సమంత హాజరై, తన చిత్రాలు ఎన్నో విజయవంతమైనవి అయినా కూడా, ఆ విజయాన్ని తాను ఆస్వాదించలేదని చెప్పుకొచ్చింది. ఆ విజయానికి కారణం ఆ సినిమాకి సంబంధించి వేరే కారణం ఎప్పుడూ చెప్పేదానిని అని, అందుకే ఆ విజయాల్ని అస్సలు ఆస్వాదించలేకపోయానని చెప్పింది సమంత.

samanthanewone.jpg

ఆ సదస్సులో సమంత మాట్లాడిన తీరు చూస్తుంటే ఆమె ఇక తెలుగు సినిమాలు చేయరేమో అనికూడా అనిపిస్తోంది. దక్షిణాదిలో కాకుండా, సమంత ఇప్పుడు పూర్తిగా హిందీ పరిశ్రమపై దృష్టి పెట్టినట్టుగా కనపడుతోంది అని తెలుస్తోంది. ఆమెకి ఒక మూడు తెలుగు సినిమాలు చెయ్యడానికి నిర్మాత, దర్శకులు కలవడానికి ఉత్సాహం చూపించినప్పుడు, సమంత వారిని తిరస్కరించినట్టుగా పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. తెలుగు సినిమాలు చెయ్యడానికి సమంత అంత ఉత్సాహం చూపించడం లేదని కూడా చర్చ నడుస్తోంది.

samanthatwo.jpg

'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ విడుదలయ్యాక సమంత ఇక హిందీ సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు చెయ్యాలని అనుకుంటున్నట్టుగా ఆమె సన్నిహితులని బట్టి తెలుస్తోంది. అందుకే సమంత ఎక్కువగా ముంబై లో కనిపిస్తోంది అని కూడా ఒక ప్రచారం వుంది. ఇక మకాం కూడా హైదరాబాదు నుండి ముంబై కి మార్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఇక దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు సినిమా సమంత చేసే అవకాశం లేదు అని పరిశ్రమలో టాక్.

Updated Date - Mar 21 , 2024 | 04:00 PM