Chiranjeevi: చిరంజీవి సినిమా నుండి తప్పుకున్న రానా దగ్గుబాటి, కారణం ఇదేనట...

ABN , Publish Date - Jan 01 , 2024 | 02:39 PM

చిరంజీవి, 'బింబిసార' దర్శకుడు మల్లిడి వశిష్ఠ కలయికలో వస్తున్న సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా చేస్తున్నారు అని ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రానా ఈ సినిమా నుండి తప్పుకున్నారు అని తెలుస్తోంది. అతనికి బదులుగా ఎవరిని తీసుకున్నారో తెలుసా...

Chiranjeevi: చిరంజీవి సినిమా నుండి తప్పుకున్న రానా దగ్గుబాటి, కారణం ఇదేనట...
Chiranjeevi and Rana Daggubati

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi), 'బింబిసార' #Bimbisara సినిమా దర్శకుడు మల్లిడి వశిష్టతో (Mallidi Vasishta) ఒక ఫాంటసీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది, చాలా సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించే ముందు ఈ సినిమాలో రానా దగ్గుబాటి (Rana Daggubati) విలన్ గా చేస్తున్నారని, కథానాయకుడు అయిన చిరంజీవిని ఢీ కొట్టనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి ఈ సినిమా నుండి తప్పుకున్నారు అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఫాంటసీ మూవీ అవటం, ఇందులో రానా వెయ్యబోయే పాత్ర అతను ముందు ముందు చెయ్యబోయే హిరణ్యకశిపుడి #Hiranyakasyap పాత్రతో పోలి ఉండటం అందుకు కారణం అని అంటున్నారు. ఈ రెండు పాత్రలు ఒకే విధంగా కనిపిస్తాయి అని రానా అనుకోవటంతో చిరంజీవి సినిమా నుండి రానా తప్పుకున్నారు అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. (Bollywood actor Kunal Kapoor replaces Rana Daggubati in Chiranjeevi and Vasistha combination film)

Rana-Daggubati.jpg

రానా తప్పుకోవడంతో చిత్ర నిర్వాహకులు వెంటనే అతనికి బదులు హిందీ నటుడు కునాల్ కపూర్ ని తీసుకున్నారని తెలిసింది. కునాల్ కపూర్ ఎక్కువ తెలుగు సినిమాలు చెయ్యలేదు, ఇంతకు ముందు నాగార్జున (Akkineni Nagarjuna), నాని (Nani)లు నటించిన 'దేవదాస్' సినిమాలో ఒక పాత్ర చేసాడు. అంతే తరువాత ఇప్పుడు ఈ చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు కునాల్ కపూర్ (Kunal Kapoor). రానా బదులుగా ఈ సినిమాలోకి వచ్చిన కునాల్ కపూర్ ఈ సినిమా కోసం షూటింగ్ కూడా మొదలెట్టేసాడు అని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణలో కునాల్ కపూర్ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇతను ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు, ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.

Updated Date - Jan 01 , 2024 | 02:39 PM