Prabhas: బాలీవుడ్ స్టార్ల‌ స‌ర‌స‌న ప్ర‌భాస్‌.. లండన్‌లో ఇల్లు కొనుగోలు?

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:48 PM

తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అదెంత‌వ‌ర‌కు నిజ‌మో గానీ రెండు రోజుల నుంచి ఈ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది.

Prabhas: బాలీవుడ్ స్టార్ల‌ స‌ర‌స‌న ప్ర‌భాస్‌.. లండన్‌లో ఇల్లు కొనుగోలు?
prabhas

తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అదెంత‌వ‌ర‌కు నిజ‌మో గానీ రెండు రోజుల నుంచి ఈ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌భాస్ (Prabhas) ప్ర‌స్తుతం క‌ల్కి సినిమా షూటింగ్ బిజీబిజీగా గ‌డుపుతుండ‌గా ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కావ‌డానికి సిద్ద‌మైంది.

Kalki.jpg

అయితే రాధేశ్యామ్ సినిమా స‌మ‌యంలోనూ, త‌న కాలుకు శ‌స్త్ర చికిత్స జ‌రిగిన స‌మ‌యంలోనూ ఎక్కువ రోజులు లండ‌న్‌లోనే ఉన్న‌ ప్ర‌భాస్ అక్కడే ఓ ఇంటిని రెంట్‌కు తీసుకుని ఉప‌యోగించుకుంటున్నాడు. నెల‌కు రూ.40 నుంచి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు అద్దె చెల్లిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki2898AD) సినిమా షూటింగ్‌కు కూడా ఇక్క‌డి నుంచే రాక‌పోక‌లు సాగిస్తున్నారు.


ఇదిలాఉండ‌గా ప్ర‌భాస్ (Prabhas) త‌ను ఇంత‌కాలం ఉంటూ వ‌చ్చిన ల‌గ్.రీ హోంను పెద్ద మొత్తంలో పైకం చెల్లించి కొనుగోలు చేశాడ‌ని, ఇక‌పై యూర‌ప్ వ‌చ్చిన ప్ర‌తీసారి అక్క‌డే ఉంటార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు నిన్న‌టినుంచి హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీటిని ప్ర‌భాస్ గానీ వారి కుటుంబ స‌భ్యులు గానీ అధికారికంగా ప్ర‌క‌టించ‌క పోయినా ఈ వార్త‌లు మాత్రం షికారు చేస్తూనే ఉన్నాయి.

prabhas.jpg

అయితే ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బ‌చ్చ‌న్‌, షారుఖ్ ఖాన్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌, సైఫ్ అలీఖాన్‌, అక్ష‌య్ కుమార్‌, జాన్ అబ్ర‌హంల‌కు మాత్ర‌మే వీదేశాల‌లో సొంత ఇండ్లు, విల్లాలు, మ్యాన్ష‌న్లు ఉండ‌గా ఇప్పుడు ప్ర‌భాస్ కూడా వారి జాబితాలో చేరాడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ (Prabhas) అభిమానులు ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోవ‌డ‌మే గాక గ‌ర్వంగా ఫీల‌వుతున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 05:48 PM