Ooru Peru Bhairavakona: ఈ సినిమా హిట్టా, పోయిందా, ఎందుకో ఎవరూ పట్టించుకోలేదు...

ABN , Publish Date - Feb 21 , 2024 | 01:33 PM

'గుంటూరు కారం' కలెక్షన్స్ విషయంలో తప్పు అని మాట్లాడిన కొంతమంది ఈసారి 'ఊరు పేరు భైరవకోన' సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు వున్నారు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ సినిమా హిట్ అయినట్టా, లేక పోయినట్టా....

Ooru Peru Bhairavakona: ఈ సినిమా హిట్టా, పోయిందా, ఎందుకో ఎవరూ పట్టించుకోలేదు...
A still from Ooru Peru Bhairavakona

సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన 'ఊరు పేరు భైరవకోన' సినిమా ఫిబ్రవరి 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద గట్టి నమ్మకంతో రెండు రోజుల ముందే అంటే ఫిబ్రవరి 14న ప్రీమియర్ ఆటలు కూడా వేశారు, వాటికి స్పందన బాగానే వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు మాత్రం స్పందన అంతగా లేదనే చెప్పాలి. బుక్ మై షోలో కూడా ఈ సినిమాకి చాలా తక్కువగానే స్పందన లభించింది. విమర్శకులకు కూడా ఈ సినిమా పెద్దగా నచ్చినట్టు కనపడలేదు. విఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు, రాజేష్ దండ నిర్మాత, అనిల్ సుంకర కూడా ఈ సినిమాలో భాగస్వామ్యంగా వున్నారు. (Ooru Peru Bhairavakona collections are fake?)

అయితే చిత్ర నిర్వాహకులు మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రకటనలు జారీ చేశారు. ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా కలెక్షన్స్ కూడా చిత్ర నిర్వాహకులు ప్రకటించినప్పుడు ఆ నిర్మాతని కొంతమంది పాత్రికేయులు ఆ కలెక్షన్స్ తప్పు అని, అవి కరెక్టు కావని వాదించారు, ఇలా ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు చెప్పారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. (Did Sundeep Kishan gets a break with OPBK?)

sundeepkishan.jpg

ఇప్పుడు ఈ 'ఊరు పేరు భైరవకోన' కలెక్షన్స్ కూడా చిత్ర నిర్వాహకులు ప్రకటించినప్పుడు ఇవి తప్పు అని అనకుండా, ఎందుకో మీడియావాళ్లు వాటిని అంత సీరియస్ గా తీసుకోలేదు అని పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది. అదీ కాకుండా ఈ చిత్రానికి ప్రీమియర్ ఆటలు వేసినప్పుడు వచ్చిన కలెక్షన్స్ తప్పితే, విడుదలయ్యాక అంతగా కలెక్షన్స్ రాలేదు అని కూడా పరిశ్రమలో అంటున్నారు. ఈ సినిమా విడుదలకి ముందు నిర్వాహకులు సినిమా గురించి గొప్పగా మాట్లాడేరు, కానీ విడుదల తరువాత మాత్రం ఎందుకో అంతగా మాట్లాడలేదు. అదీ కాకుండా 'గుంటూరు కారం' విషయంలో కలెక్షన్స్ ని తప్పుపట్టిన కొంతమంది ఈ సినిమా విషయంలో మాత్రం మాట్లాడకుండా ఎందుకు ఉండిపోయారో అర్థం కావటం లేదని కూడా పరిశ్రమలో చర్చ నడుస్తోంది. (Another flop movie in Anil Sunkara pocket?)

ఇంతకీ ఈ సినిమా హిట్ అయినట్టా, లేక పోయినట్టా. ఒకవేళ హిట్ అయితే ప్రేక్షకుల్లో, సామాజిక మాధ్యమాల్లో ఈపాటికే ఈ సినిమా గురించి వైరల్ అవ్వాలి కదా, మాట్లాడుతారు కదా అని కొంతమంది అంటున్నారు. మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.20.30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్టు చేసిందని చిత్ర నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు, నిజంగానే అంత కలెక్టు చేసిందా లేక అదికూడా ప్రచారంలో భాగమా అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర కి నిజంగానే లాభాలని తెచ్చిపెట్టిందా, లేక ఈ సినిమా కూడా ఇంకో ఫ్లాపు కింద జమైపోయిందా? అది ఆ నిర్మాతకే తెలియాలి.

ఇది కూడా చదవండి:

Ooru Peru Bhairavakona movie review: సందీప్ కిషన్ ఫాంటసీ సినిమా ఎలా ఉందంటే...

‘ఏజెంట్’ బాటలోనే సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’.. కాకపోతే?

Ooru Peru Bhairava kona: ప్రిమియర్ షో టికెట్ ఉన్న వారికి.. నా రెస్టారెంట్‌లో 20 శాతం డిస్కౌంట్

Updated Date - Feb 21 , 2024 | 01:42 PM