Devil: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా పోయినట్టే కదా!

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:53 PM

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ. 21 కోట్ల షేర్ కలెక్టు చెయ్యాలి. అభిషేక్ నామ దర్శకత్వం, నిర్మాత గా చేసిన ఈ సినిమాకి అది సాధ్యం కాదు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. మొదటి నాలుగు రోజులు బాగానే వున్నా, తరువాత ఈ సినిమా కలెక్షన్స్ ధారుణంగా పడిపోయాయని అంటున్నారు.

Devil: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా పోయినట్టే కదా!
Nandamuri Kalyan Ram from Devil

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సినిమా 'డెవిల్' #Devil గత సంవత్సరం ఆఖరి సినిమాగా విడుదలైంది. ఈ సినిమాకి చెప్పుకోదగ్గ రివ్యూస్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ సినిమా కొంచెం వివాదంలో కూడా వుండింది. ముందుగా నవీన్ మేడారం ఈ సినిమాకి దర్శకుడు, కానీ మధ్యలో ఈ సినిమాకి తనే దర్శకత్వం చేశానని నిర్మాత అభిషేక్ నామ (Abhishek Nama) చెప్పారు. అందుకని దర్శకుడిగా అభిషేక్ నామ పేరు వేసుకున్నారు. ఈ సినిమా విడుదలకి ముందు రోజు నవీన్ మేడారం (Naveen Medam) ఈ 'డెవిల్' సినిమా గురించి ఒక పెద్ద లేఖని తన సామజిక మాధ్యమంలో పెట్టారు కూడా.

ఇలా ఒక వివాదంలో విడుదలైన ఈ సినిమా కథ 1945 సంవత్సరం ప్రాంతంలో జరిగిన కథ. ఈ సినిమాకి నిర్మాత అభిషేక్ నామ చాలా ఖర్చు పెట్టారని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. సుమారు రూ.40 కోట్లకి పైగానే ఖర్చు పెట్టారని అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజమనేది నిర్మాతకు తెలియాలి. కానీ ఇది పీరియడ్ డ్రామా కథ కాబట్టి, ఒక్కో సన్నివేశం చూస్తూ ఉంటే ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టినట్టుగా కనపడుతోంది.

కళ్యాణ్ రామ్ పక్కన సంయుక్త కథానాయికగా నటించగా, ఇందులో మాళవిక నాయర్ ఇంకో ముఖ్య పాత్రలో కనపడింది. కళ్యాణ్ రామ్ ఒక గూఢచారిగా నటించిన ఈ సినిమాలో ఇంకా చాలామంది నటీనటులు కనపడతారు. అయితే వారం రోజులకి ఈ సినిమా షేర్ రూ.10 కోట్లు మాత్రమే కలెక్టు చేసిందని, ఇంకా రూ.10 కోట్లకి పైగా వస్తేనే ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అయితే అది చాలా కష్టమని కూడా చెపుతున్నారు.

devil3.jpg

ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఎక్కువైనా థియేటర్ హక్కులు మాత్రం రూ. 20 కోట్ల వరకు మాత్రమే అయినట్టుగా చెపుతున్నారు. బ్రేక్ చెయ్యాలంటే రూ.21 కోట్లు అయినా థియేటర్ వ్యాపారం చెయ్యాలి, కానీ మొదటి వారం అవగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ప్రభావం చూపించలేకపోయింది అని అనలిస్ట్స్ అంటున్నారు. అంటే ఈ సినిమా ప్లాప్ కిందే వస్తుంది అని అంటున్నారు. మరి నిర్మాతకి ఈ సినిమా ఓటిటి, శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా ఏమైనా వచ్చి ఉంటే అది థియేట్రికల్ వ్యాపారం ద్వారా వచ్చింది కలిపి చూసుకుంటే కొంచెం రికవరీ అయ్యే ఛాన్స్ వుంది అని అంటున్నారు.

ఈ సినిమాలో ఒక్కో సన్నివేశం చూస్తే విజువల్ గా బాగుంటుంది కానీ ఆ సన్నివేశాలని కలిపే కథనం మిస్ అయిందని విమర్శకులు అంటున్నారు. అందుకే ఈ సినిమాకి రేటింగ్స్ కూడా పెద్దగా రాలేదు. ముందుగా ఒక దర్శకుడుని అనుకొని, తరువాత నిర్మాత అయిన అభిషేక్ నామ సినిమాని తన చేతుల్లోకి తీసుకోవటం, కథలో మార్పులు చేర్పులు జరిగి ఉండొచ్చని, అది ఈ సినిమాకి బాగా మైనస్ అయిందని అనలిస్ట్స్ చెపుతూ వున్నారు. 'డెవిల్' ఒక మంచి సినిమా అవ్వాల్సి ఉందని, కానీ చేజేతులా పాడుచేసుకున్నారని కూడా అంటున్నారు.

Kalyan-Ram-Devil.jpg

'బింబిసార' విజయం తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ 'త్రి అమిగోస్' సినిమా చేశారు, అది ఫ్లాప్ అయింది. మళ్ళీ 'డెవిల్' ఒక పీరియడ్ డ్రామాగా తెరకెక్కించారు కానీ ఇది కూడా కళ్యాణ్ రామ్ కి విజయం ఇవ్వలేకపోయింది.

Updated Date - Jan 09 , 2024 | 01:53 PM