Janhvi Kapoor: 'పుష్ప 2' ఐటెం సాంగ్ కోసం జాన్వీ కపూర్?

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:15 PM

సమంత 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసి సంచలనం సృష్టించింది. ఆ పాటతో పాటు సమంతకి కూడా విపరీతమైన పేరొచ్చింది. ఇప్పుడు 'పుష్ప 2' లో అలాంటి ఐటెం సాంగ్ ఉందని, ఆ పాటలో జాన్వీ కపూర్ నటిస్తోందని ఒక వార్త వైరల్ అయింది.

Janhvi Kapoor: 'పుష్ప 2' ఐటెం సాంగ్ కోసం జాన్వీ కపూర్?
Samantha and Janhvi Kapoor

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' సినిమాపై రోజు రోజుకూ అంచనాలు బాగా పెరుగుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల చెయ్యడానికి చిత్ర నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. (Janhvi Kapoor) అందుకు షూటింగ్ కూడా శరవేగంగా చేస్తున్నారని భోగట్టా. అయితే 'పుష్ప' మొదటి పార్టులో సమంత చేసిన ఐటెం సాంగ్ 'వూ అంటావా మావా' పాట ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. (Janhvi Kapoor signing spree in Telugu)

alluarjunpushpa2.jpg

ఇప్పుడు ఈ రెండో పార్టులో కూడా అటువంటిదే ఒక ఐటెం సాంగ్ పెట్టాలని నిర్వాహకులు మొదటి నుండీ ఆలోచనలో వున్నారు. అయితే మొన్నటి వరకు దిశా పటానీ పేరు బాగా వైరల్ అయింది. ఆమె అల్లు అర్జున్ తో పాటు ఈ ఐటెం సాంగ్ చేస్తోంది అని ఒక వార్త హల్ చల్ చేసింది. ఇప్పుడు దిశా పటాని కాదు, జాన్వీ కపూర్ ఆ ఐటెం సాంగ్ చేస్తోంది అని తెలుస్తోంది. (Janhvi Kapoor to do a special songh in Pushpa 2)

filmfarejanhvikapoor.jpg

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మొదటి పార్టులోని ఐటెం సాంగ్ తో పాటు మిగతా పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అందులో శ్రీవల్లీ పాట కూడా వుంది. ఇప్పుడు మొదటి పార్టులో కన్నాపెద్దగా ఈ రెండో పార్టులో ఈ ఐటెం సొంగ్ ఉండాలని చిత్ర నిర్వాహకులు, దర్శకుడు సుకుమార్ ఆలోచిస్తున్నారని, అందుకు జాన్వీ కపూర్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నట్టు సమాచారం. (Sukumar and Allu Arjun wants to rope in Janhvi Kapoor for the Iteam song in Pushpa 2)

జాన్వీ కపూర్ ఈ ఐటెం సాంగ్ చెయ్యడానికి మరి వొప్పుకుందో లేదో తెలియదు కానీ, ఆమె పేరు మాత్రం అటు సామాజిక మాధ్యమాల్లో, ఇటు అల్లు అర్జున్ అభిమానుల్లో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ ఇప్పటికే రెండు తెలుగు సినిమాలతో చాలా బిజీగా వుంది. 'దేవర' లో ఎన్టీఆర్ పక్కన చేస్తున్న జాన్వీ, రామ్ చరణ్ పక్కన బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చే సినిమాలో కూడా కథానాయికగా చేస్తోంది. (Janhvi Kapoor is now signed another Telugu film opposite Ram Charan directed by Buchibabu Sana) ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంటే కనక, తల్లి శ్రీదేవి కంటే తెలుగులో ఎక్కువ పాపులర్ అయ్యేట్టు వుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఆసక్తికరం ఏంటంటే ఆమె తెలుగు సినిమాలు ఏవీ విడుదల కాకుండానే ఆమెకి ఇంత బజ్ క్రియేట్ కావటం.

Updated Date - Mar 06 , 2024 | 01:23 PM