Arjun Kapoor Malaika Arora Break Up: మ‌రో జంట‌ బ్రేక‌ప్.. విడిపోయిన మ‌లైకా, అర్జున్ క‌పూర్?

ABN , Publish Date - May 31 , 2024 | 06:42 PM

బాలీవుడ్ మోస్ట్ హ్యాప‌నింగ్ ల‌వ్ బ‌ర్ట్స్ అర్జున్ క‌పూర్, మ‌లైకా అరోరా జంట బ్రేక‌ప్ బాట ప‌ట్టింది. ఈ వార్త‌లు గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్ లో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా తాజాగా ఆ వార్త‌లు నిజ‌మన్న‌ట్లు చాలా ఆంగ్ల మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్నాయి.

Arjun Kapoor Malaika Arora Break Up: మ‌రో జంట‌ బ్రేక‌ప్..  విడిపోయిన మ‌లైకా, అర్జున్ క‌పూర్?
malaika arora

బాలీవుడ్ మోస్ట్ హ్యాప‌నింగ్ ల‌వ్ బ‌ర్ట్స్ అర్జున్ క‌పూర్ (Arjun Kapoor), మ‌లైకా అరోరా (Malaika Arora) జంట బ్రేక‌ప్ బాట ప‌ట్టింది. ఈ వార్త‌లు గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా తాజాగా ఆ వార్త‌లు నిజ‌మే అన్న‌ట్లు చాలా ఆంగ్ల మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్నాయి. ఇప్ప‌టికే వారు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వారు విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

ma.webp

2017లో త‌న భ‌ర్త స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్‌ నుంచి విడాకులు తీసుకున్న మ‌లైక ఆ త‌ర్వాతి నుంచి న‌టుడు, బోని క‌పూర్ త‌న‌యుడు అర్జున్ క‌పూర్‌తో స‌హ‌జీవ‌నం సాగిస్తోంది. అప్ప‌టికే మ‌లైకాకు కుమారుడు అర్హాన్ ఖాన్ (Arhaan Khan) ఉండ‌గా ప్ర‌స్తుతం అత‌ని వ‌య‌స్సు ఇర‌వై రెండేండ్లు.


Arjun-and-malaika.jpg

ఇదిలాఉండ‌గా మ‌లైకా (Malaika Arora) వ‌య‌సు 59 సంవ‌త్స‌రాలు కాగా అర్జున్ క‌పూర్ వ‌య‌సు 39. దీంతో వీళ్ల మ‌ధ్య‌ సుమారు 19 నుంచి 20 ఏండ్ల‌ గ్యాప్ ఉండ‌డంతో వీరి వ‌య‌సు, రిలేష‌న్‌ విష‌యంలో మొద‌టి నుంచి విమ‌ర్శ‌లు విప‌రీతంగా వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ వారు త‌మ త‌మ బంధాన్ని కొన‌సాగిస్తూనే వ‌చ్చారు. మోడ‌ల్‌గా, డ్యాన్స‌ర్‌గా, యోగా వీడియోల‌తో నిత్యం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. వ‌య‌సు మీద ప‌డుతున్నా గ్లామ‌ర్ విష‌యంలో ఎక్క‌డా మొహ‌మాటం ప‌డ‌కుండా అందాల ప్ర‌ద‌ర్శ‌ణ చేస్తూ కాక రేపుతోంది.

Updated Date - May 31 , 2024 | 06:42 PM