NBK109: బాలకృష్ణ, దుల్కర్ సల్మాన్ మధ్య సన్నివేశాలు అదిరిపోయాయి

ABN , Publish Date - Jan 23 , 2024 | 05:11 PM

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలను ఈమధ్యనే పూర్తి చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

NBK109: బాలకృష్ణ, దుల్కర్ సల్మాన్ మధ్య సన్నివేశాలు అదిరిపోయాయి
File pictures of Balakrishna and Dulquer Salman

నందమూరి బాలకృష్ణ NBK109 సినిమా షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా వున్నారు. దీనికి కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు, ఇందులో మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఈ సినిమా గురించి తెలిసిన సమాచారం ప్రకారం బాలకృష్ణ, దుల్కర్ సల్మాన్ మధ్య వచ్చే సన్నివేశాల షూటింగ్ ఈమధ్య జరిగినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్ టైనమెంట్ నిర్మిస్తోంది.

NBK109.jpg

ఊర్వశి రౌటేలా ఇందులో ఒక కథానాయికగా ఎంపికైనట్టు ఆమె పలు ఇంటర్వ్యూ లలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ చెప్పింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనపడనున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ, దుల్కర్ సల్మాన్ మధ్య సన్నివేశాలను బాబీ చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.

Nandamuri-Balakrishna.jpg

ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా వుంటాయని, చాలా బాగా వచ్చాయని, అదిరిపోయేట్టు ఉన్నాయని చిత్ర యూనిట్ సభ్యులు, సామజిక మాధ్యమాల్లో కూడా వీటి గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో దుల్కర్ ఎటువంటి పాత్రను పోషిస్తున్నాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో రాజకీయానికి సంబంధించి చాలా మాటలు, సన్నివేశాలు వుంటాయని కూడా అంటున్నారు. ఇంతకు ముందు 'వీరసింహారెడ్డి' సినిమాలో ప్రస్తావించినట్టుగానే ఈ సినిమాలో కూడా పరోక్షంగా వుంటాయని అంటున్నారు. ఆంధ్ర ప్రతిబింబించేలా కొన్ని సన్నివేశాలు ఉండొచ్చు అని కూడా అంటున్నారు.

ఈ సినిమా గురించి త్వరలోనే అప్డేట్స్ రావొచ్చు అని బాలకృష్ణ అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాబోయే ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా ఒక వార్త వినపడుతోంది.

Updated Date - Jan 23 , 2024 | 05:11 PM