అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కలుస్తున్నారు, కానీ ఇది అది కాదట

ABN , Publish Date - Feb 05 , 2024 | 01:40 PM

'ఎఫ్2' సినిమా కాంబినేషన్ మళ్ళీ రానుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి కథని తాయారు చేశారు, దీనికి దిల్ రాజు నిర్మాత, అయితే ఈ సినిమా ఆ సినిమాకి సీక్వెల్ కాదు అని అంటున్నారు.

అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కలుస్తున్నారు, కానీ ఇది అది కాదట
Varun Tej, Venkatesh and Anil Ravipudi

దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతకు ముందు నందమూరి బాలకృష్ణ తో 'భగవంత్ కేసరి' అనే విజయవంతమైన సినిమా చేసాడు. తరువాత అనిల్ రావిపూడి ఎవరితో చేస్తున్నాడు అనే విషయంపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అని తెలుస్తోంది. అతను తన తదుపరి సినిమా వెంకటేష్ కథానాయకుడిగా చేస్తున్నాడు అని తెలిసింది. అయితే ఇందులో ఇంకొక కథానాయకుడిగా వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడని అంటున్నారు.

అయితే ఈ సినిమా మాత్రం 'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్ మాత్రం కాదంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు వెంకటేష్, వరుణ్ తేజ్ ఇదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' అనే సినిమాలో నటించారు అది చాలా పెద్ద హిట్ అయిన విషయం కూడా తెలిసిందే. ఆ తరువాత ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' కూడా వచ్చింది కానీ, అది 'ఎఫ్ 2' అంత విజయవంతం కాలేదు. ఇప్ప్పుడు మళ్ళీ వెంకటేష్, వరుణ్ తేజ్ అనగానే ఆ సినిమాలకి సీక్వెల్ గా ఉంటుంది అని అనుకుంటున్నారు, కానీ ఇది పూర్తిగా దానికి భిన్నమైన కథ అని తెలిసింది. అందుకే ఆ సినిమాకి ఇది సీక్వెల్ కాదు అని అంటున్నారు.

venkateshvarun.jpg

ఈ సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాత అనే తెలిసింది. వెంకటేష్ తాజా చిత్రం 'సైంధవ్' సంక్రాంతికి విడుదలైంది, బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ కూడా అయిన విషయం తెలిసిందే. ఇంకో పక్క వరుణ్ తేజ్ కి కూడా ఈమధ్య కాలంలో సరైన హిట్ సినిమా లేదు. ఇప్పుడు ఈ ఇద్దరికీ అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఒక మంచి విజయం అందిస్తాడని అనుకుంటున్నారు. ఈసారి సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) ని తీసుకుంటున్నట్టుగా సమాచారం.

Updated Date - Feb 05 , 2024 | 01:40 PM