Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' విజయంతో అనుపమకు అన్నీ అలాంటివేనట !

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:31 PM

అంతవరకు పక్కింటి అమ్మాయిలా కనపడే అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ముద్దు సన్నివేశాల్లోనూ, గ్లామర్ పాత్ర లోనూ 'టిల్లు స్క్వేర్' లో దర్శనం కావాలనే ఇచ్చింది. ఆలా ఇవ్వటం, ఆ సినిమా ఘన విజయం సాధించటంతో ఇప్పుడు ఆమెకి ఒక్కసారిగా అవకాశాలు వచ్చి పడుతున్నాయని పరిశ్రమలో టాక్ నడుస్తోంది

Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' విజయంతో అనుపమకు అన్నీ అలాంటివేనట !
A still from Tillu Square

మలయాళం అమ్మాయి అయిన అనుపమ పరమేశ్వరన్ మంచి ప్రతిభగల నటి అని తెలుగులో నిరూపించుకుంది. అయితే ఆమె గత రెండు మూడు సంవత్సరాల నుండి ఒక మంచి విజయం కోసం చూస్తున్నారు. ఏవో రెండు మూడు సినిమాలు చేసినా, అవి అంత విజయం సాధించలేదనే చెప్పాలి. అందుకనే ఇంతవరకు ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా గత వారం విడుదలైన 'టిల్లు స్క్వేర్' లో కన్పించింది. ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలతో పాటు, అనుపమ కొంచెం గ్లామరస్ గా కూడా కనపడింది.

anupamatillusquarelatest.jpg

ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ. 85 కోట్ల గ్రాస్ కలెక్టు చేసింది అంటే, ఈ సినిమా సుదీర్ఘంగా నడిచే సమయంలో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. సిద్దు జొన్నలగడ్డని ఈ సినిమా స్టార్ ని చేస్తే, అనుపమ పరమేశ్వరన్ కి ఈ సినిమా ఒక మంచి వ్యాపారాత్మక విజయాన్ని ఇచ్చింది. ఆమె చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న విజయం ఇది. ఈ సినిమాతో ఆమె కెరీర్ లో ఒక పెద్ద మార్పు ఉండొచ్చు అని అంటున్నారు.

Tillu Square Movie Review: అంతా సిద్దు జొన్నలగడ్డ మయం

అయితే ఈ సినిమాలో అనుపమ కొంచెం గ్లామరస్ గా కనపడటంతో ఇక ముందు ఆమె చేసే సినిమాల్లో కూడా అలానే ఉండాలని, కొంతమంది దర్శకులు ఆమెని ఇప్పుడు కథానాయకురాలిగా సంప్రదిస్తున్నట్టు భోగట్టా. పరిశ్రమలో ఒక సినిమా హిట్ అవటం వేరు, అందులో నటించిన కథానాయిక ఎలా చేసింది, ఎలా కన్పించింది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అని ఒక టాక్. ఇప్పుడు అనుపమ కావాలనే కొంచెం గ్లామర్ డోస్ ఈ 'టిల్లు స్క్వేర్' సినిమాలో పెంచింది.

anupamatillusquare.jpg

ఆమె చేసిన ఈ పనికి ఆమెకి మంచి ఫలితం వచ్చినట్టే కనపడుతోంది. రాబోయే కొన్ని సినిమాలకి అనుపమని తీసుకోవాలని, ఆమె 'టిల్లు స్క్వేర్' లో చూపించిన విధంగానే రాబోయే సినిమాల్లో ఆమె పాత్రలు వుండబోతున్నాయని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అయితే ఇంతకీ అనుపమ మరి ఈ ఒక్క సినిమాకే పరిమితం అయి ఆ గ్లామ్ షో చేసిందా, లేక ముందు ముందు కూడా ఇలాంటి గ్లామర్ పాత్రలు వస్తే చేస్తుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది అని అంటున్నారు. ఏమైనా అనుపమ కోరుకున్నట్టే, ఒక్కసారిగా చాలా పెద్ద ఘన విజయం ఆమె ఖాతాలో పడింది. ఇప్పుడు అనుపమకు కచ్చితంగా మంచి అవకాశాలు రావాలి అని పరిశ్రమలో టాక్.

Updated Date - Apr 03 , 2024 | 03:31 PM