Shruti Haasan: శృతిహ‌స‌న్ మ‌రో బ్రేక‌ప్‌.. ప్రియుడికి దూరంగా కొత్త ఫ్లాట్‌?

ABN , Publish Date - Apr 26 , 2024 | 01:38 PM

క‌మ‌ల్ హాస‌న్ గారాల‌ప‌ట్టి శృతిహ‌స‌న్ మ‌రోసారి టాక్ ఆప్ ది టౌన్ అయింది. మ‌రో ప్రియుడికి బ్రేక‌ప్ చెప్పిందనే వార్త‌ ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Shruti Haasan: శృతిహ‌స‌న్ మ‌రో బ్రేక‌ప్‌.. ప్రియుడికి దూరంగా కొత్త ఫ్లాట్‌?
sruthi hasaan

క‌మ‌ల్ హాస‌న్ గారాల‌ప‌ట్టి శృతిహ‌స‌న్ (Shruti Haasan) మ‌రోసారి టాక్ ఆప్ ది టౌన్ అయింది. ఎప్పుడూ ఏదో ఒక అంశంలో వార్త‌ల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌గ‌కరాజ్‌తో చేసిన ప్రైవేట్ అల్బ‌మ్‌తో ట్రెండింగ్‌లో ఉండ‌గా తాజాగా త‌న బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక‌ప్ అయిన‌ట్లు నెట్టింట న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

cj-sruthi,lokesh.jpg

గ‌తంలోనూ త‌న కేరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న‌ప్పుడు 2019లో లండ‌న్‌కు చెందిన‌ మైఖేల్ కోర్లేతో చెట్టా పట్టాలేసుకుని తిరగ‌డ‌మే కాక ఇక్క‌డ‌ సినిమాల‌కు ఫుల్‌స్టాప్ అక్క‌డే అత‌నితో సెటిల‌యింది. తీరా కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నార‌నుకుంటున్న స‌మ‌యంలో అత‌నితో విడిపోయి తిరిగి ఇండియా వ‌చ్చి సినిమాల్లో బిజీ అయింది. ఆ త‌ర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా (Santanu Hazarika)తో డేటింగ్ చేస్తూ వ‌చ్చింది.

GLm5__2bgAAii6u.jpeg

అంతేగాక వారిద్ద‌రూ క‌లిసి పార్టీల‌కు వెళ్ల‌డం, విహార యాత్ర‌ల‌కు వెళుతూ ఆ ఫొటోల‌ను త‌మ సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేస్తూ త‌మ మ‌ధ్య బంధాన్ని ప‌బ్లిక్‌గానే ఉంచేది. ఉన్న‌ట్టుండి ఏమైందో ఏమో ఈ జంట ఇటీవ‌ల బ‌య‌ట గానీ సోష‌ల్ మీడియాల్లో గానీ క‌నిపించ‌డం బంద్ అయింది. ఈ క్ర‌మంలో శృతిహ‌స‌న్ తాజాగా త‌న ఇన్‌స్టాలో ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఫొటోల‌ను డిలీట్ చేయ‌డ‌మే కాక శంత‌ను (Santanu Hazarika)ను అన్ ఫాలో చేసింది.

FmXLoo6aYAA7dkG.jpeg

శంత‌ను కూడా శృతి(Shruti Haasan) ని అన్ ఫాలో చేయ‌డంతో వీరిద్ద‌రి విష‌యంలో ప‌లు వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్లే ఈ జంట గురువారం రాత్రి ముంబ‌య్‌లో జ‌రిగిన సంజ‌య్‌లీలా భ‌న్సాలీ చిత్రం ‘హీరామండి’ ప్రీమియర్ షోకు మాత్రం శృతిహ‌స‌న్ (Shruti Haasan) ఒంట‌రిగా రావ‌డంతో ఈ బ్రేక‌ప్ వార్త‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్లు అయింది.


అయితే బ్రేక‌ప్ అయిన, అవ‌బోతున్న సెలబ్రిటీలు త‌మ త‌మ ఇన్‌స్టా గ్రామ్‌, ఇత‌ర సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో అవ‌త‌లి వారిని అన్ ఫాలో చేయడం, రిలేషన్‌షిప్ ట్యాగ్ లను తొలగించ‌డం అన‌వాయితీగా చేస్తూ వ‌చ్చి త‌మ భావాల‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ జేస్తున్నారు. ఇదే త‌ర‌హాలో శంత‌ను (Santanu Hazarika), శృతి హ‌స‌న్ (Shruti Haasan) చేయ‌డంతో వారిద్ద‌రి మధ్య బ్రేకప్ అయిందనే ప్రచారం జోరందుకుంది.

FPLsTtnVkAIm4jw.jpeg

నెల రోజుల క్రిత‌మే ఈ తంతంగం అంతా జ‌రిగింద‌ని అప్ప‌టి నుంచే శృతిహ‌స‌న్ ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ప్రాతంలో ప్లాట్‌లో స‌ప‌రేట్‌గా ఉంటున్న‌ట్లు స‌మాచారం. గ‌త సంవ‌త్స‌రం శృతిహ‌స‌న్ వాల్తేరు వీర‌య్య‌, వీర సింహా రెడ్డి, స‌లార్ వంటి చిత్రాల‌లో చిరంజీవి, బాల‌కృష్ణ వంటి బ‌డా స్టార్స్‌తో న‌టించి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాల‌ను ద‌క్కించుకుని కేరీర్‌లోనే మంచి ఫీక్‌లో ఉంది. ప్ర‌స్తుతం స‌లార్ 2, అడ‌వి శేష్ డెకాయిట్ , ర‌జ‌నీకాంత్ 171, ఓ ఆంగ్ల చిత్రం శృతి (Shruti Haasan), చేతిలో ఉన్నాయి.

FWE-AeBUAAAlAge.jpeg

Updated Date - Apr 26 , 2024 | 01:41 PM