Max Review: కిచ్చా సుదీప్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'మ్యాక్స్‌' ఎలా ఉందంటే..

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:01 AM

కన్నడ హీరో అయినా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిచ్చా సుదీప్‌.  ‘విక్రాంత్‌ రోణ’ సక్సెస్‌ తర్వాత  రెండేళ్లు గ్యాప్‌ ఇచ్చారు. అయితే ఈ గ్యాప్‌లో పలు చిత్రాల్లో కామియో రోల్స్‌ చేశారు. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి హీరోగా నటించిన చిత్రం ‘మ్యాక్స్‌’.

సినిమా రివ్యూ:   'మ్యాక్స్‌' (Max Movie review)
విడుదల తేది: 27–12–2024
నటీనటులు: కిచ్చా సుదీప్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంయుకాంత హోర్నాడ్‌, శుక్ర వాగ్లే, సునీల్‌, శరత్‌ లోహితస్వ, వంశీకృష్ణ, ఆడుకాలమ్‌ నరేన్‌, ఇళవరసు తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: శేఖర్‌ చంద్ర,
సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌ గణేష్‌ బాబు
నిర్మాతలు: కలైపులి ఎస్‌ ధాను, సుధీప్‌
దర్శకత్వం: విజయ్‌ కార్తికేయ (Vijay Karthikeya)

కన్నడ హీరో అయినా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిచ్చా సుదీప్‌.  ‘విక్రాంత్‌ రోణ’ సక్సెస్‌ తర్వాత  రెండేళ్లు గ్యాప్‌ ఇచ్చారు. అయితే ఈ గ్యాప్‌లో పలు చిత్రాల్లో కామియో రోల్స్‌ చేశారు. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి హీరోగా నటించిన చిత్రం ‘మ్యాక్స్‌’.  కన్నడలో ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు.  తెలుగు ట్రైలర్‌ ప్రేక్షకుల్ని మెప్పించడంతో సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. విజయ్‌కార్తికేయ దర్శకత్వంలో ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్‌ థాను నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ:
అర్జున్‌ అలియాస్‌ మాక్స్‌ (సుదీప్‌) సీఐగా ఛార్జ్‌ తీసుకోవడానికి కొత్త ఊరికి తల్లితో కలిసి వస్తాడు. ట్రైన్‌ దిగి ఇంటికి వెళ్తుండగా గని (సునీల్‌) ఇచ్చిన పార్టీ నుంచి డ్రగ్స్‌ మత్తులో మునిగి తేలిన ఇద్దరు మంత్రుల కుమారులు వీర, మైఖేల్‌ దార్లో పోలీసులతో గొడవపడి మహిళ పోలీసుతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. తెల్లారితే డ్యూటీలో జాయిన్‌ కావాల్సిన సీఐ మ్యాక్స్‌ వారిని అరెస్ట్‌ చేసి కటకటాల్లో పడేస్తాడు. అరెస్ట్‌ కాబడిన వారు ముంత్రుల కుమారులు కావడంతో ఎఫ్‌ఐఆర్‌ రాయడానికి స్టేషన్‌ రైటర్‌ సంకోచిస్తాడు. అరెస్ట్‌ విషయం మంత్రుల అనుచరులకు తెలియడంతో గుంపులుగా పోలీసులపై దాడి చేయడానికి దిగుతారు. వాళ్ళను మ్యాక్స్‌ అండ్‌ టీమ్‌ ఎలా ఎదుర్కొంది. అయితే జైల్లో పెట్టిన ఇద్దరూ మరణిస్తారు. అదెలా జరిగింది. క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌లో సీఐగా పని చేస్తున్న రూప (వరలక్ష్మి శరత్‌ కుమార్‌) నుంచి మ్యాక్స్‌ అండ్‌ టీమ్‌కి ఎలాంట ముప్పు ఎదురైంది. మంత్రులకు భయపడ్గ మ్యాక్స్‌ టీమ్‌ను గండం నుంచి ఎలా గట్టెక్కించాడు అన్నది కథ.


Max-2.jpg
విశ్లేషణ:
పోలీస్‌ స్టేషన్‌లో ఒక రోజుల్లో జరిగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. వీర, మైఖేల్‌ మరణం, ఇద్దరు మంత్రులకు, గ్యాంగ్‌స్టర్‌ గనికి భయపడి వణికిపోతున్న స్టేషన్‌ సిబ్బందిని సేవ్‌ చేయడానికి మ్యాక్స్‌ ఏం చేశాడన్నది మైండ్‌ గేమ్‌లా చూపించారు. టైటిల్‌కు తగ్గట్టే సుదీప్‌ పాత్ర చిత్రణ ఉంది. సినిమా మొత్తం హీరో ఇమేజ్‌ మీదే సాగుతుంది. ఒక్కరోజుల్లో మూడు గంటల కథ చెప్పాలంటే కాస్త కష్టమే. ప్రతి క్షణం కీలకమే అన్నట్లు పని చేయాలి. ఆ ప్రయత్నంలో దర్శకుడు విజయ్‌ సఫలం అయ్యాడు. సెల్‌లో వీర, మైఖేల్‌లను గొడవ పడటం, చనిపోవడం వెనుక మ్యాక్స్‌ ఉన్నాడనే ప్రీ క్లైమాక్స్‌ వరకూ అనిపిస్తుంది. కానీ చివర్లో ఇచ్చే ట్విస్ట్‌ ఊహకు ఏమాత్రం అందలేదు. కానీ ట్విస్ట్‌ సీన్‌ను ఇంకాస్త గ్రిప్‌గా తీసుంటే డబుల్‌ విజిల్స్‌ పడేవి. ఆ ట్విస్ట్‌ ఏంటనేది తెరపైనే చూడాలి. సినిమా మొదలైన అరగంట పాటు కాస్త భారంగా నడిచినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌కు అదంతా గుర్తు రాకుండా చేశాడు దర్శకుడు. మాస్‌ ఆడియన్స్‌ కోరుకునే సన్నివేశాలు హై మోమెంట్స్‌ ఇందులో చాలానే ఉన్నాయి. యాక్షన్‌ సీన్స్‌లో సుదీప్‌ ఇరగదీశాడనే చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో యాక్షన్‌ పార్ట్‌ అతిగా అనిపించినా సుదీప్‌ బాడీ లాంగ్వేజ్‌ చూస్తేకొడితే ఎగిరి అవతల పడడం అనేది కన్వెన్‌సింగ్‌గానే అనిపించింది. నటీనటుల విషయానికొస్తే.. సుదీప్‌కు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. ఇది పెద్ద సవాల్‌ విసిరే పాత్ర కూడా కాదు. అయితే ఇమేజ్‌ స్వాగ్‌ వల్ల క్యారెక్టర్‌ బాగా ఎలివేట్‌ అయింది. నటన పరంగా ఎక్కడా పేరు పెట్టడానికి లేదు. మాస్‌కి మ్యాక్స్‌ పాత్ర విపరీతంగా ఎక్కేస్తుంది. సునీల్‌ మాస్‌ డాన్‌ రోల్‌ చేశాడు. ఆయన పాత్ర ఫర్వాలేదనిపించింది. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పోలీస్‌ పాత్రలో వరలక్ష్మి ప్రజెన్స్‌ బావుంది. కథలో కీలకమైన క్యారెక్టర్‌ చేసిన తమిళ నటుడు ఇళవరసు చాలా బ్యాలెన్స్‌ చేస్తూ నటించారు. మిగతా నటీనటులు ఫర్వాలేదనిపించారు. లేడీ కానిస్టేబుల్స్‌గా చేసిన ఇద్దరు కాస్త అతి చేసినట్లు అనిపించింది. అజనీష్‌ లోక్‌నాథ్‌ పాటలు గుర్తు పెట్టకునేలా లేవు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అయితే ఆర్‌ఆర్‌ విషయంలో అప్పుడప్పుడు తమన్‌ బాణీలు వినిపించాయి. బాగా లౌడ్‌గా అనిపించింది. దర్శకుడి పనితీరులో లోకే్‌శ్‌ కనగరాజ్‌ ప్రభావం కనిపించింది. సినిమా ఎక్కువ శాతం రాత్రి సమయంలో ఉండడం.. దానికి తగ్గట్టు కెమెరా పనితనం ఉంది. ఫస్ట్‌ఫ్‌లో కాస్త కత్తెర వేసుంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి.
ఇందులో పెద్ద కథ ఏమీలేదు. తనని నమ్ముకున్న స్టాఫ్‌కు పై అధికారి ఎలా అండగా ఉన్నాడు అన్నదే కాన్సెప్ట్‌.  నార్మల్‌ రివేంజ్‌ స్టోరీనే కానీ.. దర్శకుడు తెరకెక్కించడంలో కొత్తదనం చూపించి ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. మాస్‌ జనాలకు మ్యాగ్జిమమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే సినిమా ఇది. ఫ్లోలో వెళ్తున్న సినిమా చూసి, ప్రేక్షకుడు వావ్‌ అనుకునే కమర్షియల్‌ సినిమాల్లో లాజిక్కులు పట్టుకోవలసిన అవసరం లేదు. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నాడా లేదా అన్నదే ఈ ముఖ్యం. మ్యాక్స్‌ కొత్త కథ కాకపోయినా.. ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించేలా ఉంది. మాస్‌ యాక్షన్‌ చిత్రాలు కోరుకునే వారికి ఈ నచ్చుతుంది అనడంతో ఎలాంటి సందేహం లేదు.

ట్యాగ్‌లైన్‌: మ్యాగ్జిమమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌...

Updated Date - Dec 27 , 2024 | 07:19 AM