జీబ్రా లుక్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:53 AM

టాలీవుడ్‌ హీరో సత్యదేవ్‌, కన్నడ కథానాయకుడు డాలీ ధనంజయ నటిస్తున్న మల్టీస్టారర్‌ ‘జీబ్రా’. ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ అనేది ఉపశీర్షిక. ఎస్‌.ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేశ్‌ సుందరం నిర్మిస్తున్నారు...

టాలీవుడ్‌ హీరో సత్యదేవ్‌, కన్నడ కథానాయకుడు డాలీ ధనంజయ నటిస్తున్న మల్టీస్టారర్‌ ‘జీబ్రా’. ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ అనేది ఉపశీర్షిక. ఎస్‌.ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేశ్‌ సుందరం నిర్మిస్తున్నారు. గురువారం సత్యదేవ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘జీబ్రా’ నుంచి ఆయన లుక్‌ను యూనిట్‌ విడుదల చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. పోస్టర్‌లో సత్యదేవ్‌ సూట్‌లో, భుజంపై బ్యాగ్‌, చేతిలో పెన్నుతో స్టైలిష్‌ అవతార్‌లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. నిర్మాతలు త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ క్రైమ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ పిక్కినాటో హీరోయిన్స్‌. సునీల్‌, సత్యరాజ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్‌. ఎడిటర్‌: అనిల్‌ క్రిష్‌

Updated Date - Jul 05 , 2024 | 12:53 AM