రాజకీయ నేపథ్యంలో

ABN , Publish Date - May 11 , 2024 | 05:23 AM

‘యువత రాజకీయాల్లోకి రావాలి’ అనే కాన్సె్‌ప్టతో రూపుదిద్దుకున్న చిత్రం ‘రామజన్మభూమి’. జై సిద్దార్థను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో

రాజకీయ నేపథ్యంలో

‘యువత రాజకీయాల్లోకి రావాలి’ అనే కాన్సె్‌ప్టతో రూపుదిద్దుకున్న చిత్రం ‘రామజన్మభూమి’. జై సిద్దార్థను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో వి.సముద్రారావు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సీనియర్‌ ఆర్టిస్ట్‌ మురళీమోహన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దేశంలో ఇప్పుడు ఎక్కడ విన్నా జై శ్రీరామ్‌ నినాదం మారుమోగుతోంది, ‘రామ జన్మభూమి’ పేరుతో సముద్ర ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. చిత్రం పెద్ద హిట్‌ అవుతుంది’ అన్నారు. దర్శకనిర్మాత సముద్రారావు మాట్లాడుతూ ‘ ఆ దేవుడే రాముడిగా వచ్చి మానవ రూపంలో ధర్మబద్ధంగా బతికాడు. ప్రతి పౌరుడు రాముడిలా బతకాలి. రాజకీయాల్లోకి యువత కచ్చితంగా రావాలనే సందేశంతో ఈ సినిమా తీశాం. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉందని జై సిద్దార్థ చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బి.గోపాల్‌, దామోదర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2024 | 05:23 AM