యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తారు

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:10 AM

దర్శకుడు విఐ ఆనంద్‌సందీప్‌కిషన్‌ హీరోగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ ఈ నెల 16న విడుదల కానుంది. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు...

యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తారు

దర్శకుడు విఐ ఆనంద్‌సందీప్‌కిషన్‌ హీరోగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ ఈ నెల 16న విడుదల కానుంది. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించగా విఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.

ఆయన సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర విశేషాలు వెల్లడించారు.

  • ‘టైగర్‌’ చిత్రం తర్వాత మరో సినిమా చేయాలని నేను, సందీప్‌ అనుకున్నాం. నా దగ్గరున్న రెండు ఐడియాల గురించి ఆయనకు చెప్పినప్పుడు ‘ఊరు పేరు భైరవకోన’ కథ విని చాలా ఎక్సయిట్‌ అయ్యాడు. ఒక ట్రెండ్‌ సెట్‌ చేసేలా ఉంటుందని ఆ కథను ఫిక్స్‌ చేశాం. సందీప్‌ ఇంతవరకూ సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ జోనర్‌ చేయలేదు. విజువల్స్‌, సౌండ్‌ పరంగా ఒక గొప్ప అనుభూతినిచ్చే సినిమా ఇది. నిర్మాత రాజేశ్‌గారు కూడా ఈ కథ బాగుందన్నారు. మా మంచి కోరే వ్యక్తి అనిల్‌ సుంకర్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో జర్నీ మొదలైంది.

  • కర్మ సిద్ధాంతం, గురించి చెప్పే సినిమా ఇది. గరుడ పురాణంలోని కొన్ని అంశాలు తీసుకున్నాం. ముఖ్యంగా ఆత్మ ప్రయాణం గురించి గరుడ పురాణంలో వివరంగా ఉంది.

  • ఈ రోజుల్లో ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించాలంటే కంటెంట్‌ బలంగా ఉండాలి. విజువల్స్‌ కొత్త అనుభూతి కలిగించాలి. అందుకే నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత రాజేశ్‌గారు ప్రతిదీ సమకూర్చారు. సినిమాలో రెండు పెద్ద ట్విస్టులు ఉన్నాయి. ప్రతి పది నిమిషాలకు ప్రేక్షకులు ఊహించని మలుపులు కథలో ఉంటాయి. యూత్‌, ఫ్యామిలీతో పాటు అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. అలాగే వెన్నెల కిశోర్‌ కామెడీ ట్రాక్‌ అలరిస్తుంది. అలాగే వైవా హర్ష పాత్ర కూడా నవ్విస్తుంది.

  • చిత్ర పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతోంది. ఇంకో మూడు చిత్రాలు ఫిల్మోగ్రఫీలో యాడ్‌ అయి ఉంటే బాగుండేదనిపిస్తోంది. ప్రస్తుతం నిఖిల్‌తో ఓ సినిమా చర్చల్లో ఉంది.

Updated Date - Feb 13 , 2024 | 06:10 AM